కోచిన్ షిప్ యార్డ్ లో ( COCHIN SHIPYARD LIMITED ) వివిధ రంగాల్లో వర్క్ మెన్ పదవుల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఒక వేళ మీరు ఉద్యోగం ( Jobs ) కోసం వెతుకుతోంటే ఈ న్యూస్ మీకోసమే. భారత ప్రభుత్వ సంస్థ అయిన మినీరత్న కంపెనీ కోచిన్ షిప్ యార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ లో జారీ అయిన నోటిఫికేషన్ లో భాగంగా అప్లై చేసుకోవాలి అంటే చివరి తేదీ అక్టోబర్ 10, 2020. దీని కోసం అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేయాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ|  SP Balasubrahmanyam Facts: గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గురించి ఎవరికీ తెలియని విషయాలు


మొత్తం పోస్టుల సంఖ్య
కంపెనీలో మొత్తం 577 పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది.


అర్హతలు
అప్లై చేయాల్సిన అభ్యర్థులు 4వ, 7వ తరగతి, మెట్రిక్ లేదా సమాన విద్యార్హతతో పాటు సంబంధిత అంశాల్లో ఐటీఐ-ఎన్ టీసి, వీటితో పాటు అభ్యర్థుల వద్ద తప్పనిరిగా ఫోర్ట్ లిఫ్ట్, క్రేన్ ఆపరేటర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.


వయసు పరిమితి
ఈ పదవులకు అప్లై చేయాల్సిన అభ్యర్థుల వయసు 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అక్టోబర్ 1, 2020 నాటి వరకు ఉన్న వయసు ఆధారం. రిజర్వేషన్ రూల్స్ ప్రకారం అభ్యర్థుల వయసులో మినహాయింపులు ఉంటాయి.



ALSO READ| Gold Monetisation Scheme: లాకర్ లో ఉన్న మీ బంగారంతో డబ్బు సంపాదించండి


జీతం
ఎంపిక అయిన అభ్యర్థులకు రూ.22,100 నుంచి  24,800  వరకు జీతం ఇస్తారు.


మరిన్ని వివరాల కోసం https://cochinshipyard.com/ పోర్టల్ ను విజిట్ చేయండి.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR