SP Balasubrahmanyam Facts: గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గురించి ఎవరికీ తెలియని విషయాలు

భారతీయ సినీ ప్రపంచానికి తన గాత్రంతో ఎనలేని సేవ చేసిన మహా గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం.

  • Sep 25, 2020, 13:58 PM IST


భారతీయ సినీ ప్రపంచానికి తన గాత్రంతో ఎనలేని సేవ చేసిన మహా గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం. 1966లో తన సినీ ప్రస్థానం మొదలు పెట్టిన ఎస్పీ బాలు గాన గంధర్వుడిగా ఎదిగారు. ఆయన గాత్రంలో ఎదో మ్యాజిక్ ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది.  సింగర్ గానే కాకుండా నటుడిగా కూడా రాణించారు. 

1 /7

అనంతపూర్ లో ఇంజినీరింగ్ చదవడానికి జేఎస్టీయూలో చేరి ఎస్పీ బాబు.. కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలోనే చదువు ఆపారు. తరువాత చెన్నైలోనే  ఇంజినీరింగ్ విద్య కొనసాగిస్తూ కొన్ని సింగింగ్ కాంపిటీషన్స్ లో పాల్గోన్నారు. తన గాత్రంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక పోటీలో జడ్జ్ గా వచ్చిన ఎస్పీ కోదండపాణి .. బాలును ప్రోత్సాహించారు.

2 /7

తన జీవిత కాలంలో 40 వేలకు పైగా పాటలు పాడిన ఎస్పీ బాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. ఒక లెక్కన ప్రతీ సంవత్సరం 930 పాటలు పాడారు. ప్రపంచంలో ఈ స్థాయిలో పాటలు రికార్డు చేసిన సింగర్ ఎవరూ లేరు.

3 /7

ఒక్క రోజులోనే అత్యధిక పాటలు పాడిన రికార్డు కూడా బాలూ పేరుపై ఉంది. 12 గంటల్లో 21 పాటలు పాడి రికార్డు క్రియేట్ చేశారు. కన్నడ కంపోజర్ ఉపేంద్ర కుమార్ సారధ్యంలో ఆయన 21 పాటలు పాడారు. అదే విధంగా ఒక్కరోజులోనే 19 తమిళ సాంగ్స్, 16 హిందీ సాంగ్స్ పాడిన రికార్డు కూడా ఆయనకే సొంతం.

4 /7

నటనతో పాటు ఎస్పీ బాలు పలు చిత్రాల్లో కూడా నటించారు. తెలుగు, కన్నడ, తమిళంలో మొత్తం 74 సినిమాలు చేశారు. దాంతో పాటు 46 చిత్రాలకు సంగీత సారథ్యం కూడా వహించారు.

5 /7

తన జీవితంలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి ఎస్పీ బాలు.. ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఆయన సంగీతానికి చేసిన సేవకు గాను ఆయనకు ఆరు సార్లు జాతీయ అవార్దు వరించింది.

6 /7

సంగీతం అంటే ప్రాణం అయిన ఎస్పీ బాలు పలు టీవీ ఛానెల్స్ లో జడ్జీగా కూడా వ్యవహరించారు.

7 /7

ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం కుటుం విషయానికి వస్తే..బాలు జీవిత భాగస్వామి పేర సావిత్రి, కుమారు ఎస్పీ చరణ్.  చెల్లెలు ఎస్పీ శైలజ.