College Girls Photos Morphed at Ghatkesar Engineering College: టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో అదే టెక్నాలజీని అడ్డుపెట్టుకుని అడ్డదారులు తొక్కుతున్న వారి సంఖ్య కూడా అదే రేంజ్ లో పెరిగిపోతోంది.  తాజాగా హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్ లో ఉన్న విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సదరు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినుల వాట్సాప్ డిపి ఫోటోలను తీసికొందరు యువకులు మార్ఫింగ్ చేసినట్టు గుర్తించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విద్యార్థినుల నార్మల్ ఫోటోలను న్యూడ్ ఫోటోలుగా తయారు చేసి కొన్ని వాట్సప్ గ్రూపులో యువకులు పోస్టు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక ఆ మార్ఫింగ్ ఫోటోలను అర్ధరాత్రి సమయంలో పంపి విద్యార్థులను అగంతకులు వేధిస్తున్నట్లు చెబుతున్నారు.  ఇదే విధంగా పలువురు ఇంజనీరింగ్ విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్న ఆగంతుకులు ఆ మార్ఫింగ్ చేసిన ఫోటోలని వాట్సప్ గ్రూపులలో  పోస్ట్ చేస్తున్న అగంతకులు వారికి నిద్ర కూడా లేకుండా చేస్తున్నారు.


కేవలం విద్యార్థినులు వాట్సాప్ లో పెట్టుకున్న డిపి ఫోటోలను తీసుకొని ఆ యువకులు వాటిని న్యూడ్ ఫొటోలుగా మార్ఫింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాదు వాట్సప్ గ్రూపులో అమ్మాయిలని యాడ్ చేసి మార్ఫింగ్ ఫోటోలని పోస్ట్ చేస్తున్న అగంతకులు వారందరినీ టెన్షన్ పెడుతున్నారు.  విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజీలో పలువురు విద్యార్థినుల ఫోటోలు మార్ఫింగ్ చేయడంతో ఈ మార్ఫింగ్ ఫోటోలపై విద్యార్థినులు ఆందోళన చేపట్టారు.


ఇక విద్యార్థినుల ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాలేజీలో విచారణ చేపట్టిన ఘట్కేసర్ పోలీసులు కాలేజీకి చెందిన కొందరు యువకులను ప్రశ్నిస్తున్నారు. ఇక విద్యార్థినుల  ఆందోళన నేపథ్యంలో కాలేజీకి భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు కల్పించారు, ఆందోళనలో పాల్గొంటున్న విద్యార్థినులు ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
Also Read: Shock to Balakrishna: నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలకి ఏపీ సర్కార్ షాక్.. ఏమైందంటే?


Also Read: Veera Simha Reddy Pre Release: ఒంగోలులోనే వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook