Veera Simha Reddy Pre Release: ఒంగోలులోనే వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే?

Veera Simha Reddy Pre Release Event: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పోలీసులు షాక్ ఇవ్వగా ఇప్పుడు యూనిట్ మరో వేదిక వెతుక్కుంది. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 5, 2023, 11:58 AM IST
Veera Simha Reddy Pre Release: ఒంగోలులోనే వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే?

Veera Simha Reddy Pre Release Event Venue Changed in Ongole:  నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలు వేదికగా నిర్వహించాలని సినిమా యూనిట్ ముందుగా నిర్ణయం తీసుకుంది. ఒంగోలులోని ఏబీఎం కాలేజీ గ్రౌండ్స్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 6వ తేదీన అంటే రేపు నిర్వహిస్తున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో పోలీసులు సినిమా యూనిట్ కు షాక్ ఇచ్చారు.

ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కనుక నిర్వహిస్తే పక్క జిల్లాల నుంచి కూడా అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది, దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందనే నేపద్యంలో ఒంగోలు నగరంలో నిర్వహించే అవకాశం ఇవ్వడం లేదని కావాలంటే ఒంగోలు శివార్లలో ఎక్కడైనా చేసుకోమని పేర్కొన్నారు. అయితే చివరి నిమిషంలో షాక్ ఇవ్వడంతో ఇప్పటికిప్పుడు వేరే గ్రౌండ్స్ ఏముంటాయి? అని యూనిట్ వారంతా వెతుకులాటలో పడి ఒకవేళ గ్రౌండ్ దొరక్కపోతే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో జరపకుండా హైదరాబాదులో జరపాలా? లేకపోతే పూర్తిగా ఈవెంట్ నిర్వహించకుండా ఆపేయాలా అనే ఆలోచన కూడా చేశారు.

అయితే చివరికి ఒంగోలు శివారులలోనే మరో వేదికను ఫిక్స్ చేశారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఒంగోలు శివార్లలో బిఎంఆర్ గ్రూప్ కి సంబంధించిన అర్జున్ ఇన్ఫ్రా అనే ప్రాజెక్టుకు సంబంధించిన స్థలంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలు చీరాల రోడ్డులో ఈ ఈవెంట్ జరగబోతోంది. ఇక ఈ అంశానికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా ఈ 107వ సినిమాని గోపీచంద్ మలినేని తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో కనిపించారు.

ఇక ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి, జనవరి 12వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా కోసం బాలకృష్ణ అభిమానులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ చివరిగా చేసిన అఖండ సినిమా సూపర్ హిట్ కావడం, దర్శకుడు గోపీచంద్ మలినేని చేసిన చివరి సినిమా క్రాక్ సూపర్ హిట్ కావడంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా ఎలా ఉండబోతోంది? అనే విషయం మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలాగే నందమూరి అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది? అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఇక ఒంగోలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Woman Slits Husband's Throat: ఏపీలో న్యూయర్‌ విషెష్‌ చెప్పలేదని భర్త గొంతు కోసిన భార్య!

Also Read: Shock to Balakrishna: నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలకి ఏపీ సర్కార్ షాక్.. ఏమైందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News