తెలంగాణలో ప్రస్తుతం రెండు విషయాలపై చర్చ జరుగుతోంది. ఒకటి హైదరాబాద్ మేయర్ ఎవరు అవుతారు, ఎవరు ఎవరికి మద్దతిస్తారు. రెండోవ విషయం.. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలోని అన్ని కీలక పార్టీలు నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై దృష్టిసారించాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.జానారెడ్డి (Jana Reddy) ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో నోముల నర్సింహయ్య చేతిలో కాంగ్రెస్ (Congress) నుంచి పోటీ చేసిన జానారెడ్డి ఓటమిపాలు కావడం తెలిసిందే. 


Also Read : Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డిపై అట్రాసిటీ కేసు



తాజాగా జరగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేస్తారని కాంగ్రెస్ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు భావిస్తున్నారు. అయితే బై ఎలక్షన్స్‌లో తాను పోటీచేసేది లేదని జానారెడ్డి స్పష్టం చేశారు. రెండేళ్ల కొరకు ఇప్పుడు తాను పోటీచయలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనే తన నిర్ణయాన్ని వెల్లడించానని చెప్పారు.


Also Read : Boy Flying in The air with a Kite: గాలిపటంతో 30 అడుగుల వరకు ఎగిరిన బాలుడు.. ఆ తర్వాత ఏమైంది!



కాగా, ఈ ఉప ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేస్తారని జానారెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ వచ్చి చెప్పినా తాను పోటీ చేసేది లేదన్నారు. పీసీసీ ఎవరనే దానిపై కేంద్రానికి నా అభిప్రాయాన్ని తెలియజేశానని, పార్టీని వీడాల్సిన అవసరం తనకు లేదని సీనియర్ నేత జానారెడ్డి వివరించారు.


Also Read: ​WhatsApp Features: మీ వాట్సాప్‌లో మెస్సెజ్‌లు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయా.. ఇలా చేస్తే సరి! 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook