హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలోని (Osmania University) భూముల్లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ చేపట్టిన నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఓయూ క్యాంపస్ లో కబ్జా అయిన భూముల సందర్శనకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెళ్లగా పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంతేకాకుండా పోలీసులతో వి.హనుమంతరావు వాగ్వాదానికి దిగారు. తాము శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టామని, ఓయూ భూముల రక్షణకై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: రోబో టీవీ యాంకర్‌ను చూశారా..?


కాగా కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత మల్లు భట్టీ విక్రమార్క (Mallu Bhatti Vikramarka) మాట్లాడుతూ ఓయూ భూములను రక్షించాలని పిటిషన్ ఇచ్చిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, స్టాప్‌పై కేసులు బుక్ చేశారని ఆయన మండిపడ్డారు. కబ్జా చేసిన వారికి పోలీసు రక్షణ కల్పించి, నిర్మాణాలు చేసుకునేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీ భూములను కొల్లగొట్టి ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలనే ఆలోచనను విరమించుకోవాలని హెచ్చరించారు. ఇదిలాఉండగా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.  జీ