Telnagana: కొత్తగా 1,717 కరోనా కేసులు నమోదు
గడిచిన 24 గంటల్లో శనివారం రాత్రి 8 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 1,717 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana) నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా రికవరీ జాతీయ రేటు కన్నా తెలంగాణలోనే అధికం.
తెలంగాణలో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో శనివారం రాత్రి 8 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 1,717 కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus cases in Telangana) నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా వైరస్ కేసుల సంఖ్య 2,12,063కు చేరింది. అదే సమయంలో నిన్న ఒక్కరోజే కరోనాతో పోరాడుతూ 5 మంది చనిపోయారు. తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,2,22కి చేరింది.
కరోనా బారి నుంచి శనివారం ఒక్కరోజే 2,103 మంది బాధితులు కోలుకుని డిశ్ఛార్జ్ కావడం గమనార్హం. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ఆదివారం ఉదయం విడుదల చేసింది. తెలంగాణలో ఇప్పటివరకూ కోలుకున్న కరోనా బాధితుల సంఖ్య 1,85,128కి పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 25,713 ఉండగా, అందులో 21,209 మంది ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో నిన్న ఒక్కరోజే 46,657 శాంపిల్స్‌కు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ చేసిన కరోనా టెస్టుల సంఖ్య 35,47,051కి చేరింది. కరోనా రికవరీ జాతీయ రేటు కన్నా తెలంగాణలోనే అధికం. భారత్‌లో కరోన రికవరీ రేటు 85.9 శాతం ఉండగా, తెలంగాణలో 87.29 శాతంగా ఉందని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe