Telangana: కరోనావైరస్ లేటెస్ట్ అప్డేట్స్
COVID-19 updates | హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం నాడు కొత్తగా 178 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 143 జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోనే ఉన్నాయి. మిగతా కేసుల్లో రంగారెడ్డి జిల్లాలో 15 కేసులు, మేడ్చల్ జిల్లాలో 10 కేసులు, మహబూబ్‌నగర్‌లో జిల్లాలో 2, సంగారెడ్డి జిల్లాలో 2, మెదక్ జిల్లాలో 2, జగిత్యాల, ఆసిఫాబాద్, సిరిసిల్ల, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
Telangana COVID-19 updates | హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం నాడు కొత్తగా 178 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 143 జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోనే ఉన్నాయి. మిగతా కేసుల్లో రంగారెడ్డి జిల్లాలో 15 కేసులు, మేడ్చల్ జిల్లాలో 10 కేసులు, మహబూబ్‌నగర్‌లో జిల్లాలో 2, సంగారెడ్డి జిల్లాలో 2, మెదక్ జిల్లాలో 2, జగిత్యాల, ఆసిఫాబాద్, సిరిసిల్ల, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల (COVID-19 cases) సంఖ్య 3472 కి చేరింది. తాజాగా నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో బాధితులంతా స్థానికులే ఉండటం గమనార్హం. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో మొత్తం 448 మందికి కరోనావైరస్ సోకింది. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 3920 కు చేరింది. ( Tollywood: సినీ ప్రముఖులకు స్టూడియోలతో పాటు ఇళ్ల స్థలాలు.. కానీ ఒక కండిషన్ ! )
తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం మంగళవారం తెలంగాణలో కరోనాతో ఆరుగురు మరణించారు ( COVID-19 deaths). దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 148కు చేరింది. రాష్ట్రంలో కరోనా నుంచి నయమై డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1742 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2030 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..