Telangana Covid-19: తాజాగా 2,239 కరోనా కేసులు
తెలంగాణ వ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
Telangana Coronavirus Updates: హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే.. గత 24గంటల్లో శుక్రవారం ( సెప్టెంబరు 25 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 2,239 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా 11 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులతో.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,83,866 కి చేరగా.. మరణాల సంఖ్య 1,091 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శనివారం ఉదయం కరోనా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 1,52,441 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 30,334 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. Also read: Durgam Cheruvu Cable Bridge: భాగ్యనగరానికి మరో మణిహారం
ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా గురువారం 58,925 కరోనా టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 28,00,761 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 82.90 శాతం ఉండగా.. మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. అయితే.. నిన్న అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 316 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి..
[[{"fid":"193862","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."}},"link_text":false,"attributes":{"alt":"telangana corona cases bulletin ","title":"తెలంగాణలో కరోనా కేసులు..","class":"media-element file-default","data-delta":"1"}}]]
Also read: AP ICET-2020 ఫలితాలు విడుదల.. 78శాతం మంది ఉత్తీర్ణత