Telangana: తాజాగా 2,009 కరోనా కేసులు
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్త.. మళ్లీ రెండువేలకుపైగా నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలకు చేరువలో ఉంది.
Telangana Coronavirus Updates: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్త.. మళ్లీ రెండువేలకుపైగా నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలకు చేరువలో ఉంది. గత 24 గంటల్లో గురువారం ( అక్టోబరు 1 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 2,009 కరోనా కేసులు నమోదు కాగా.. 10 మంది ఈ మహమ్మారి కారణంగా మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,95,609 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,145 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. అయితే ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 1,65,844 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం తెలంగాణలో 28,620 మంది చికిత్స పొందుతున్నారు. Also read: Hathras Case: ఆ దుర్మార్గులను నడిరోడ్డుపై కాల్చి చంపాలి: బీజేపీ ఎంపీ ఛటర్జీ
ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా గురువారం 54,098 కరోనా టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో అక్టోబరు 1 వరకు రాష్ట్రంలో 31,04,542 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 84.78 శాతం ఉండగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. నిన్న అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో కొత్తగా 293 కేసులు నమోదయ్యాయి. Also read: Hathras Case: అర్థరాత్రి దహన సంస్కారాలపై వివరణ ఇవ్వండి: మహిళా కమిషన్