Hathras Case: అర్థరాత్రి దహన సంస్కారాలపై వివరణ ఇవ్వండి: మహిళా కమిషన్

ఉత్తరప్రదేశ్‌ (UP) లోని హత్రాస్ జిల్లాలో యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఉన్నత వర్గానికి చెందిన నలుగురు దుండగులు యువతిపై అత్యాచారానికి పాల్పడి (Hathras Gang rape ) దాడి చేయగా.. బాధితురాలు చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసింది.

Last Updated : Oct 1, 2020, 05:43 PM IST
Hathras Case: అర్థరాత్రి దహన సంస్కారాలపై వివరణ ఇవ్వండి: మహిళా కమిషన్

NCW seeks UP DGP's explanation on Hathras Case: ఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ (UP) లోని హత్రాస్ జిల్లాలో యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఉన్నత వర్గానికి చెందిన నలుగురు దుండగులు యువతిపై అత్యాచారానికి పాల్పడి ( Hathras Gang rape ) దాడి చేయగా.. బాధితురాలు చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసింది. అయితే.. అత్యాచార బాధితురాలి మృత‌దేహాన్ని ఆమె కుటుంబ స‌భ్యులకు అప్పగించకుండా.. కుటుంబ సభ్యులు లేకుండా అర్థ‌రాత్రి 2.30 గంటల సమయంలో ద‌హ‌న సంస్కారాలు నిర్వ‌హించడంపై జాతీయ మహిళా కమిషన్ (NCW) ఆందోళన వ్యక్తంచేసింది. అర్థరాత్రి వేళ, బాధితురాలి కుటుంబసభ్యులు లేకుండా ఎందుకు దహన సంస్కారాలు నిర్వహించారో వివరణ ఇవ్వాలంటూ జాతీయ మ‌హిళా క‌మిష‌న్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు మహిళా కమిషన్ యూపీ డిజీపీకి లేఖను పంపించింది. Also read: Hathras gang rape case: హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో కొత్త ట్విస్ట్.. హత్రాస్ ఎస్పీ సంచలన వ్యాఖ్యలు

యూపీలోని హత్రాస్ జిల్లాలోని ఓ గ్రామంలో సెప్టెంబర్ 14న దళిత మహిళపై ఉన్నతవర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్ప‌డి.. నాలుక కోసి, గొంతు నులిమి చిత్రహింసలు పెట్టారు. దీంతోపాటు బాధితురాలు ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఆ తర్వాత ఆమెను చూసిన కుటుంబసభ్యులు ముందుగా ఢిల్లీలోని ఎఎంయూలో చేర్చారు. ఆతర్వాత ఆమె పరిస్థితి క్షీణించడంతో సప్దర్ జంగ్ ఆసుపత్రిలో చేర్చగా.. ఆమె చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసింది. అయితే పోస్టుమార్టం అనంతరం బాధితురాలి మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పజెప్పకుండా.. బుధవారం తెల్లవారుజామున 2.30 గంట‌ల స‌మ‌యంలో పోలీసులు బలవంతంగా గ్రామంలో దహన సంస్కారాలు చేశారు. అయితే కుటుంబ సభ్యుల అనుమతి, వారు లేకుండా.. బాధితురాలి దహన సంస్కారాలను అర్ధరాత్రి వేళ‌ ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలంటూ కమిషన్ యూపీ డీజీపీని వివరణ కోరింది. Also read: Rahul Gandhi: మోదీజీ మాత్రమే దేశంలో నడుస్తారా..?

Trending News