Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్త.. మళ్లీ రెండువేలకుపైగా నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య నిన్ననే 2లక్షలు దాటిన సంగతి తెలిసిందే. గత 24 గంటల్లో మంగళవారం ( అక్టోబరు 6 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 2,154 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 8 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,04,748 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,189 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: WHO: ఈ ఏడాది చివరి నాటికి.. కోవిడ్ వ్యాక్సిన్!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 1,77,008 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 26,551 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 86.45 శాతం ఉండగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. Also read: WHO: పది మందిలో ఒకరికి కరోనా.. రాబోయేది మరింత కష్టకాలం!


ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం 54,277 కరోనా టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో అక్టోబరు 6 వరకు రాష్ట్రంలో 33,46,472 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. అయితే రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 303, రంగారెడ్డి జిల్లాలో 205, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 187 కేసులు చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.


[[{"fid":"194496","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."}},"link_text":false,"attributes":{"alt":"telangana corona cases bulletin ","title":"తెలంగాణలో కరోనా కేసులు..","class":"media-element file-default","data-delta":"1"}}]]


Bharat Biotech: కోవాగ్జిన్ రెండో దశ క్లినికల్ టెస్టులు ప్రారంభం