Telangana Covid-19: 2.5 లక్షలు దాటిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్తా.. మళ్లీ పెరుగుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరో్నా కేసులతోపాటు.. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.
Coronavirus Updates in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్తా.. మళ్లీ పెరుగుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరో్నా కేసులతోపాటు.. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతోపాటు మరణాలు కూడా చాలా తక్కువగా సంభవిస్తున్నాయి. అయితే గత 24 గంటల్లో శనివారం ( నవంబరు 7న) రాత్రి 8 గంటల వరకుతెలంగాణలో కొత్తగా 1,440 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఐదుగురు (5) మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,50,331 కి చేరగా.. మరణాల సంఖ్య 1,377 కి పెరిగింది. Also read: Haj 2021: హజ్ యాత్రకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
అయితే గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 1,481 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా (Telangana) కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,29,064 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 19,890 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 91.50 శాతం ఉండగా.. మరణాల రేటు 0.55 శాతంగా ఉంది. Also read: Joe Biden: అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటా: జో బిడెన్
ఇదిలావుంటే.. శనివారం తెలంగాణ వ్యాప్తంగా 42,673 కరోనా పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 7వ తేదీ వరకు మొత్తం 46,18,470 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 278 కేసులు నమోదయ్యాయి. అయితే.. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి..
[[{"fid":"197078","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."}},"link_text":false,"attributes":{"alt":"telangana corona cases bulletin ","title":"తెలంగాణలో కరోనా కేసులు..","class":"media-element file-default","data-delta":"1"}}]]