హైద‌రాబాద్‌: ‌తెలంగాణలో కొత్తగా మ‌రో 2,511 మందికి కరోనావైరస్ ( Coronavirus ) సోకింది. గత 24 గంటల్లో కరోనాతో 11 మంది చనిపోయారు. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 1,38,395కు చేర‌గా, కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 877 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,915 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలోనూ 25,729 మంది హోం ఐసోలేష‌న్‌లోనే ఉన్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ( COVID-19 health bulletin ) ప్రకారం కొత్త‌గా న‌మోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో ( GHMC ) 305 కేసులు నమోద‌వ‌గా, రంగారెడ్డి జిల్లాలో 184, న‌ల్ల‌గొండ‌ జిల్లాలో 170, క‌రీంన‌గ‌ర్‌ జిల్లాలో 150, ఖ‌మ్మం జిల్లాలో 142, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరిలో 134, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 96, సూర్యాపేట‌లో 96, భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో 93, నిజామాబాద్‌లో 93,  జ‌గిత్యాల‌లో 85,  సిద్దిపేట‌లో 80, యాదాద్రి భువ‌న‌గిరిలో 78, మంచిర్యాల‌లో 73, రాజ‌న్న‌సిరిసిల్ల‌లో 72, సంగారెడ్డిలో 70, పెద్ద‌ప‌ల్లిలో 65, కామారెడ్డిలో 60, మ‌హ‌బూబాబాద్‌లో 58 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. Also read : Jagananna Vidya kanuka: జగనన్న విద్యా కానుక పథకం వాయిదా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే నాగ‌ర్‌క‌ర్నూల్‌లో 48, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 42,  మెద‌క్‌లో 42, వ‌న‌ప‌ర్తిలో 40, వ‌రంగ‌ల్ రూర‌ల్‌లో 36, జ‌న‌గామ‌లో 35, నిర్మ‌ల్‌లో 31, జోగులాంబ గ‌ద్వాలలో 27, ఆదిలాబాద్‌లో 23, వికారాబాద్‌లో 19, ములుగులో 18,  ఆసిఫాబాద్ జిల్లాలో 16, నారాయ‌ణ‌పేట‌లో 16, జ‌య‌శంక‌ర్‌ భూపాల‌ప‌ల్లిలో 12 కేసుల చొప్పున నమోదయ్యాయి. Also read : Jagadishwar Reddy: మాజీ ఎమ్మెల్సీ మృతి


గత 24 గంటల్లో2,579 మంది క‌రోనాతో కోలుకోగా ( Coronavirus recoveries ) అలా ఇప్పటివరకు కరోనాతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 1,04,603కు చేరింది. Also read : TS: కరోనా మృతులపై వాస్తవాలు చెప్పండి.. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం