Coronavirus patient: నల్లగొండ: ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డు నుంచి కరోనా పాజిటివ్ పేషెంట్ తప్పించుకున్న ఘటన స్థానిక అధికారులను కాసేపు ఉరుకులు పరుగులు పెట్టించింది. మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆమెను కరోనా చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే,  ఆమె అక్కడి నుంచి ఐసోలేషన్ వార్డు ( Isolation ward ) నుంచి తప్పించుకుందని తెలియడంతో ఆస్పత్రి సిబ్బంది, అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.  ( Also read: Kawasaki Syndrome: కొవిడ్-19 పోనే లేదు భారత్‌లో మరో వ్యాధి కలకలం )


ఇదిలావుంటే, కోవిడ్-19తో బాధపడుతున్న పేషెంట్ ( COVID-19 patient ) చికిత్స మధ్యలోనే ఇంటికి తిరిగిరావడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఇదే విషయమై గ్రామస్తులు పోలీసులు, స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. గ్రామస్తుల సమాచారంతో పేషెంట్ ఇంటికి వెళ్లిన పోలీసులు, వైద్య సిబ్బంది.. ఆమెను 108 వాహనంలో ( 108 Ambulance ) తిరిగి ఆసుపత్రికి తరలించారు. ( Also read: COVID-19 vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్‌పై స్పష్టత వచ్చేసింది )