Telangana: తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాలనుంచే కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Telangana COVID19 Cases: తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాలనుంచే కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు కరోనా కారణంగా 11 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య 25,733కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 306 మంది మరణించారు. అయితే 14,781 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 10,646 మంది చికిత్స పొందుతున్నారు. Also read: Telangana: అందుబాటులోకి TIMS సేవలు..
[[{"fid":"187245","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
జీహెచ్ఎంసీ నుంచే అత్యధిక కేసులు..
రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా హైదరాబాద్ నగరం నుంచే బయట పడుతుండటంతో నగరంలో భయాందోళన పెరిగింది. తాజాగా జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో అత్యధికంగా 1419 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 160 కేసులు వెలుగులోకి వచ్చాయి. Also read: IPL 2020: ఐపీఎల్ రద్దయితే భారీ నష్టం..
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live