Minister Harish Rao at NIMS: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చదువుకుంటున్న డా ప్రీతి సీనియర్స్ ర్యాంగింగ్ తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిపాలైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన పెనుదుమారం రేపింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు అన్నీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన మహ్మద్ సైఫ్ కి ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిపాలైన డా ప్రీతిని పరామర్శించి ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసేందుకని శుక్రవారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నిమ్స్ ఆస్పత్రికి వచ్చారు.  వైద్య విద్యార్థిని ప్రీతిని పరామర్శించేందుకు మంత్రి హరీష్ రావు నిమ్స్ హాస్పిటల్‌కి వస్తున్నారని తెలుసుకున్న ప్రీతి స్నేహితులు, మద్దతుదారులు అంతా నిమ్స్ వద్ద గుమిగూడి మంత్రి హరీష్ రావుకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. 


డా ప్రీతి సూసైడ్ అటెంప్ట్ కేసులో ప్రభుత్వం నిందితుడు మహ్మద్ సైఫ్‌కి వెనకేసుకొస్తోందని ఆగ్రహం వ్యక్తంచేసిన వైద్య విద్యార్థులు.. మంత్రి హరీష్ రావు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. డా ప్రీతికి న్యాయం చేయాలి అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంత్రి హరీష్ రావు రాక సందర్భంగా వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో నిరసనకు దిగిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని పంజాగుట్ట పలీసు స్టేషన్‌కి తరలించారు. అనంతరం వారిని అక్కడి నుంచి పంపించేశారు.


ఇది కూడా చదవండి : Preethi Suicide Attempt: ప్రీతిని చూడ్డానికి వచ్చిన గవర్నర్ కారులో పూలదండపై దుమారం.. స్పందించిన రాజ్ భవన్


ఇది కూడా చదవండి : Constable Died in Gym: జిమ్‌లో వర్కౌట్ చేస్తూ కానిస్టేబుల్ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook