Preethi Suicide Attempt News: హైదరాబాద్: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ విద్యను అభ్యసిస్తున్న ప్రీతి సూసైడ్ అటెంప్ట్ పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ప్రీతిని పరామర్శించడానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుదుచ్చేరి నుండి నేరుగా నిమ్స్ ఆస్పత్రికి వచ్చి ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యుల బృందంతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రీతి త్వరగా కోలుకునేలా మెరుగైన చికిత్స అందించాలని నిమ్స్ వైద్యులను ఆదేశించారు. అనంతరం అక్కడే ఉన్న ప్రీతి తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
ఇదిలావుంటే, ప్రీతిని పరామర్శించడానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆస్పత్రికి వెళ్లిన సందర్భంలో గవర్నర్ వాహనంలో పూల దండ ఉండటంపై రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. ఈ పుకార్లపై స్పందించిన రాజ్ భవన్ అధికారవర్గాలు.. అదొక దుష్ప్రచారంగా కొట్టిపడేశాయి.
గవర్నర్ ఎప్పుడు వేరే ప్రాంతాలకు వెళ్లినా.. తిరిగి రాజ్ భవన్‌కు వచ్చే సమయంలో ఖైరతాబాద్‌లో ఉన్న హనుమంతుడి గుడికి వెళ్ళి దేవుడిని దర్శించుకొని, దేవుడికి పూలమాల సమర్పించి రావడం అనేది చాలా కాలంగా ఒక ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆనవాయితీ ప్రకారమే.. బుధవారం కూడా మధురై నుంచి వచ్చే క్రమంలో ఎప్పటిలాగే కారులో హనుమంతుని గుడిలో సమర్పించే ఉద్దేశంతో పూల మాల సిద్దం చేయడం జరిగింది. ఉంచడం జరిగింది. కానీ అసలు విషయం పట్టించుకోకుండా రాజ్ భవన్‌పై బురద జల్లే ఉద్దేశంతో లేనిపోని దుష్ప్రచారం చేయడం సరికాదని రాజ్ భవన్ వర్గాలు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశాయి.
ఆస్పత్రి నుంచి వచ్చే క్రమంలో గుడికి వెళ్లిన గవర్నర్.. ప్రీతీ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని వేడుకున్నారు. అంతేకాకుండా రాజ్ భవన్ కి వచ్చిన మరుక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డిజిపికి ఈ ఘటనపై లేఖ రాసిన గవర్నర్ డా తమిళిసై సౌందరరాజన్.. " ఘటనపై విచారణ చేపట్టి అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు " అని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇది కూడా చదవండి : Constable Died in Gym: జిమ్‌లో వర్కౌట్ చేస్తూ కానిస్టేబుల్ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్
ఇది కూడా చదవండి : RGV Satires: ఓ 5 వేల కుక్కల్ని ఆమె ఇంట్లో వదిలి తాళాలు వేసేయండి, వైరల్ అవుతున్న ఆర్జీవీ ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook