సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక (Dubbaka Assembly Bypoll) ప్రారంభమైంది. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన స్థానానికి నేడు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నేటి ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆ సమయం వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశాలన్ని కల్పించనున్నట్లు పోలింగ్ అధికారులు తెలిపారు. మొత్తం 1,98,756 మంది ఓటర్లుండగా.. అందులో మహిళలు 1,00,778 మంది, పురుషులు 97,978 మంది ఉన్నారు.


Dubbaka Bypoll: ప్రజలకు తెలియాలంటూ.. కేటీఆర్ ఆసక్తికర ట్విట్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


నేడు పోలింగ్ జరుగుతున్న ఈ స్థానంలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. టీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత రెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం మాత్రం వాడివేడిగా జరిగింది. దీంతో దుబ్బాక ప్రజలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దుబ్బాక ఉపఎన్నికలపై చర్చలు జరిగి ప్రజలకు ఆసక్తి పెరిగింది.


Dubbaka టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డి వాహ‌నం త‌నిఖీ


 


ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ అని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు సుధాకర్ రెడ్డి క్షేత్రస్థాయిలో ఓటర్లపై ఫోకస్ చేసి ప్రచారం చేశారు. మరోవైపు కరోనా కారణంగా హోంక్వారంటైన్‌లో ఉన్న 130 మందిలో 93 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి గంట ముందు కరోనా బాధితులకు ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. ప్రత్యేక పీపీఈ కిట్లు సిద్ధం చేశారు.


TRS ఎమ్మెల్యే మరణంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe