BRS MLA Lasya Nanditha Death: లాస్య ఒంటిపై 12 తాయత్తులు.. అయినా వెంటాడి కబలించిన మృత్యువు..!
BRS MLA Lasya Nanditha Death News: సికింద్రాబాద్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) మృతితో బీఆర్‌ఎస్ పార్టీ, కంటోన్మెంట్ వ్యాప్తంగా విషాధఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా గత ఏడాదే ఆమె తండ్రి సాయన్న కన్నుమూశారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున టిక్కెట్ రావడంతో ఆమె గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు.
BRS MLA Lasya Nanditha Death News: సికింద్రాబాద్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) మృతితో బీఆర్‌ఎస్ పార్టీ, కంటోన్మెంట్ వ్యాప్తంగా విషాధఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా గత ఏడాదే ఆమె తండ్రి సాయన్న కన్నుమూశారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున టిక్కెట్ రావడంతో ఆమె గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. పటాన్‌చేరు ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టడంతో తీవ్రగాయాలతో ఆమె నిన్న మృతిచెందారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో లాస్య అంత్యక్రియలు కూడా అధికారిక లాంఛనాలతో జరిగాయి. అయితే లాస్య నందిత ఒంటిపై 12 తాయత్తులు ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం సమయంలో సంబంధిత వైద్యులు వీటిని పోలీసులకు అప్పగించారట.
ఇదిలా ఉండగా ఆమె ఇదివరకే మూడుసార్లు ప్రమాదం బరిన పడ్డారు. మొదటగా ఓ ప్రముఖ ఆసుపత్రి ప్రారంభోత్సవంవానికి వెళ్లిన లాస్య నందిత ఆసుపత్రి లిఫ్టులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈనెల 13న కేసీఆర్ నల్గొండలో నిర్వహించిన సభకు లాస్యనందిత హాజరయ్యారు. తిరుగుప్రయాణంలో నార్కట్ పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద అప్పుడు స్వల్ప గాయాలతో బయటపడింది. కానీ, కారు కింద కానిస్టేబుల్ పడటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆలయాలు, పూజలు చేయించుకుని తాయత్తులు కట్టించుకున్నట్లు తెలుస్తోంది. అయినా, ఆమెను మృచ్చవు కబలించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేవలం పదిరోజుల్లో కారుప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం అందరికీ తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసింది. డ్రైవర్, పీఏల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: Mahalakshmi LPG Gas Cylinder: రూ. 500 గ్యాస్ సిలిండర్‌పై కీలక అప్డేట్.. ముందు మొత్తం ధర చెల్లించాల్సిందే..
లాస్యనందిత మరణానికి కారణం సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఇంటర్నల్ పార్ట్స్ బాగా డ్యామేజ్ అవ్వడం. లాస్య మృతిపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మాజీ సీఎం కేసీఆర్ లాస్య అకాల మరణం బాధకరమన్నారు. ఆమె మృతదేహాన్ని సందర్శించి శుక్రవారం నివాళులర్పించారు. ఆమె కుటుంబానికి అండంగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రముఖులు ఆమె అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా లాస్య మరణానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
ఇదీ చదవండి: Medaram Jathara 2024: అత్యంత వైభవోపేతంగా మేడారం జాతర.. నేడు సమ్మక్క సారలమ్మల వనప్రవేశం..
చిన్నవయస్సులోనే మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయి లాస్య చనిపోవడం బాధకరమని మాజీ మంత్రి తలసాని అన్నారు. కేటీఆర్ కూడా తన ప్రగాఢ సానుభూతిని తెలిసి, ఆమెను కలిసిన ఫోటోలను ట్విట్టర్ వేధికగా పంచుకున్నారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి