Mahalakshmi LPG Gas Cylinder: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసింది. తమను గెలిపిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల నేపథ్యంలో ప్రకటించారు. అదేవిధంగా ఒక్కో గ్యారెంటీలను అమలు చేయడానికి కృషి చేస్తుంది కూడా. ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచింది. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఇటీవలె అభయహస్తంలో భాగంగా దరఖాస్తు పారమ్ తీసుకున్నారు. ప్రస్తుతం ఇది ప్రాసెసింగ్ దశలో ఉంది.
మేడారంలో సమ్మక్క, సారక్క కొలువుదీరడంతో శుక్రవారం తల్లులను రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. అనంతరం మేడారం సమీపంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారంటీలను ఈనెల 27వ తేదీన ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ పథకాల ప్రారంభోత్సవానికి ప్రియాంకా గాంధీ హాజరవుతారని వెల్లడించారు.
ఇదీ చదవండి: Medaram Jathara 2024: అత్యంత వైభవోపేతంగా మేడారం జాతర.. నేడు సమ్మక్క సారలమ్మల వనప్రవేశం..
అయితే, హామీలో భాగంగా రూ. 500 కే సిలిండర్ రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. కేవలం తెల్లరేషన్ కార్డు ఉండి, ప్రజాపాలనలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నవారికే వర్తిస్తుందన్న సంగతి తెలిసిందే. కానీ, దీనిపై పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుందట. ఈ క్రమంలో లబ్దిదారులు సిలిండర్ డెలివరీ తీసుకునేటప్పుడు సిలిండర్ మొత్తం ధర చెల్లించాలట. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ ధర రూ.500 తీసివేయగా మిగతా డబ్బును లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలో నేరుగా జమా అయిపోతుందట.
ఇదీ చదవండి: Mallu Ravi: తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం.. సంచలనం సృష్టించిన మల్లు రవి రాజీనామా
ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నఅర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టారు. ఇందులో ప్రభుత్వం ప్రకటించిన అయిదు గ్యారంటీలకు అర్హులైన వారందరి నుంచి గ్రామసభలు, వార్డు సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. 5 గ్యారంటీలకు మొత్తం 1,09,01,255 దరఖాస్తులు నమోదయ్యాయి. జనవరి 12వ తేదీ నాటికే వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు అధికారులు సీఎంకు నివేదించారు. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి