Eetala Rajender visits Teenmar Mallanna: హైదరాబాద్: చంచల్ గూడ జైలులో ఉన్న తీన్మార్ మల్లన్నను హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపి నేత ఈటల రాజేందర్ ములాఖత్ అయ్యారు. చంచల్ గూడ జైలులో తీన్మార్ మల్లన్నను కలిసి దాడి జరిగిన రోజు అసలేం జరిగిందని అడిగి తెలుసుకున్నారు. తీన్మార్ మల్లన్న అరెస్ట్ ని నిరసిస్తూ మీకు, మీ కుటుంబానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయనకు ధైర్యం చెప్పారు. అనంతరం బోడుప్పల్ లోని తీన్మార్ మల్లన్న ఇంటికి వెళ్లి మల్లన్న కుటుంబాన్ని పరామర్శించారు. తీన్మార్ మల్లన్న భార్యకు, తల్లికి ధైర్యం చెప్పారు. ప్రజల కోసం పోరాడే జర్నలిస్టులకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పి తీన్మార్ మల్లన్న కుటుంబంలో మనోస్తైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, తీన్మార్ మల్లన్నపై అనేక సంవత్సరాలుగా పగబట్టారు. ఆఫీసుల మీద దాడి చేయడం, కంప్యూటర్లను, ఇతర సామాగ్రిని ధ్వంసం చేయడం.. అందులో పని చేస్తున్న జర్నలిస్టులపై, సిబ్బందిపై దౌర్జన్యం చేయడం.. ఇంటి ఓనర్‌ను బెదిరించి వాళ్లను ఖాళీ చేయించాలని చూడటం లాంటి కుట్రలకు పాల్పడుతున్నారు. ఇవి చాలవు అన్నట్లుగా గతంలోనే అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేశారు. కేసులకు బెదిరింపులకు భయపడని మల్లన్న తన వృత్తిని కొనసాగిస్తున్న క్రమంలో మళ్లీ ప్రైవేటు గూండాల చేత ప్రైవేట్ మనుషుల చేత దాడి చేయించే ప్రయత్నం చేశారు. దాడి చేసిన వారి మీద కేసులు పెట్టాలి కానీ మళ్లీ మల్లన్న మీదనే హత్యాయత్నం కేసు పెట్టడం అనేది పూర్తి అప్రజాస్వామీకం అవుతుంది అని ఆగ్రహం వ్యక్తంచేశారు.


తీన్మార్ మల్లన్నపై కావాలనే ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి జైల్లో పెట్టాలని చూశారని.. రోజువారీగా ప్రచారం చేసే వార్తలను అడ్డుకోవాలి.. అలా మల్లన్నను ప్రేక్షకులకు దూరం చేయాలనే కుట్రలో భాగంగానే ఆయన్ను అక్రమ కేసుల్లో, అక్రమ పద్దతిలో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఈటల రాజేందర్ ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టడం, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను పెట్టీ బెయిల్ రాకుండా చేయడం, కోర్టులను మేనేజ్ చేయడం వంటి పనులతో వేధింపులకు గురిచేస్తున్నారు అని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలపై దాడులకు పాల్పడే ఇలాంటి అప్రజాస్వామిక పద్ధతులు మంచివి కావు. మీకు ఒక న్యాయం మందికొక న్యాయం ఉండే ఆస్కారం లేదు. ప్రజాస్వామ్యాన్ని చెరబడితే, అకారణంగా దాడి చేస్తే.. అధికారం ఉందని బెదిరిస్తే అదే బాధ అనుభవించే రోజు మీకు కూడా వస్తుంది. అప్పుడు మీరు తప్పించుకోలేరు అని ఈటల రాజేందర్ హెచ్చరించారు.


పోలీసులు కూడా ప్రగతి భవన్ నుంచి స్కెచ్ రాగానే అమలు చేసే పద్ధతి మంచిది కాదు. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండవు. కేసీఆర్ ప్రభుత్వం 2023 వరకే ఉంటుంది. చెప్పగానే కొట్టడం, కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం మంచిది కాదు. నిష్పక్షపాతంగా, చట్టబద్ధంగా వ్యవరించండి కానీ చెప్తే చేసే మరమనుషులగా ఉండవద్దు అని పోలీసు అధికారులకు సూచించారు. ఈ రోజు తీన్మార్ మల్లన్న  కుటుంబాన్ని పరామర్శించా. ధైర్యంగా ఉండాలని చెప్పడం జరిగింది. మల్లన్నను లోపల వేయచ్చు కానీ మల్లన్న ఆలోచనకి అనుకూలంగా ఉండే లక్షలాదిమంది ఆపలేరు. తీన్మార్ మల్లన్న లాంటి ప్రశ్నించే గొంతుకలను ఎక్కువ కాలం నిర్బంధాలతో, కేసులతో, జైలులో పెట్టి ఏమైనా చేయొచ్చనుకుంటే కుదరదు. తెలంగాణ సమాజం ఇలాంటి అప్రజాస్వామిక పద్ధతులను ఓర్చుకోదు. సందర్భం వచ్చినప్పుడు బరిగ తిరిగేసి కొట్లాడి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారు అని ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


ఇది కూడా చదవండి : Delhi Liquor Scam Case: సుప్రీంలో వాడివేడిగా వాదనలు, కవితకు నిరాశ, మూడు వారాలు వాయిదా


ఇది కూడా చదవండి : Minister Harish Rao: సర్పంచ్‌లకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి నేరుగా అకౌంట్‌లోకి డబ్బులు జమ


ఇది కూడా చదవండి : TSRTC: ప్రయాణిలకు గుడ్‌న్యూస్.. తొలిసారి అందుబాటులోకి ఏసీ బస్సులు.. ప్రత్యేకతలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK