Delhi Liquor Scam Case: సుప్రీంలో వాడివేడిగా వాదనలు, కవితకు నిరాశ, మూడు వారాలు వాయిదా

Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నిరాశ ఎదురైంది. ఈడీ ఇచ్చిన సమన్లు సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడటంతో ఆందోళన నెలకొంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 27, 2023, 04:16 PM IST
Delhi Liquor Scam Case: సుప్రీంలో వాడివేడిగా వాదనలు, కవితకు నిరాశ, మూడు వారాలు వాయిదా

Delhi Liquor Scam Case: దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటీషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. ఈ కేసులో కవిత న్యాయవాది కపిల్ సిబల్ వర్సెస్ ఈడీ న్యాయవాది మధ్య వాదనలు ఆసక్తిగా సాగాయి. విచారణను మరో మూడు వారాలకు వాయిదా వేసింది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. వాస్తవానికి తన పిటీషన్‌పై అత్యవసర విచారణ చేయాలని మార్చ్ 15న కవిత దాఖలు చేసిన పిటీషన్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తిరస్కరించి..ఈనెల 24కు వాయిదా వేశారు. కానీ కొన్ని కారణాలతో ఆ రోజు జరగాల్సిన విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది. ఈలోగా ఆమె మూడుసార్లు ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ప్రతిసారీ అరెస్టు తప్పదనే ఊహాగానాల మధ్య ఉత్కంఠత నెలకొంది. మళ్లీ ఈసారి విచారించినప్పుడు అరెస్టు ఉంటుందనే వాదన కచ్చితంగా విన్పిస్తోంది. 

ఇందుకు తగ్గట్టుగానే ఈడీ సమన్లను సవాలు చేస్తూ కవిత దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగినా..కేసు ఏకంగా మూడు వారాలకు వాయిదా పడింది. ఈడీ సమన్లు రద్దు చేయాలని, ఇంటి వద్దనే విచారించాలని, ఎలాంటి అరెస్టులు చేయవద్దని కవిత పిటీషన్‌లో కోరారు. కవిత తరపున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదించగా, ఈడీ తరుపు తుషార్ మెహతా వాదించారు. కవితకు నోటీసులు ఇచ్చే క్రమంలో ఈడీ నియమాలు, నిబంధనలు పాటించలేదని..విచారణకు రావల్సిందిగా నోటీసుల్లో ఈడీ కోరిందని గుర్తు చేశారు. నిందితురాలే కానప్పుడు విచారణకు ఎలా పిలుస్తారని కపిల్ సిబల్ అభ్యంతరం తెలిపారు. దీనికి సంబంధింతి అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం కేసుల్ని పరిశీలించాలని కోరారు.  

అయితే విజయ్ మండల్ తీర్పు పీఎంఎల్ఏ కేసులకు వర్తించదని, ఈ కేసులో ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం ఈడీకు ఉంటుందని తుషార్ మెహతా వాదించారు. ఇరు వర్గాల వాదనల్ని విన్న సుప్రీంకోర్టు లిఖిత పూర్వక వాదన సమర్పించాలని ఈడీ, ఎమ్మెల్సీ కవితలను ఆదేశించింది. కేసును మూడు వారాలకు వాయిదా వేసింది. 

Also read: Viveka Murder Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం, దర్యాప్తు అధికారి మార్పుకు ఆదేశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News