EC recognition to YSRTP: వైఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల తన తల్లి విజయమ్మ, భర్త అనిల్ కుమార్ పలువురు పార్టీ నేతలతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. పార్టీకి గుర్తింపు లభించిన విషయాన్ని వైఎస్ షర్మిల ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'వైఎస్సార్ తెలంగాణ పార్టీకి అధికారిక గుర్తింపునిచ్చిన భారత ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు. ప్రజా సేవే ధ్యేయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా చివరివరకూ మా పార్టీ పనిచేస్తుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల కోసం పనిచేస్తాం. ప్రజల మధ్యే ఉంటాం. వైఎస్సార్ బాటలోనే పయనిస్తాం.. జై తెలంగాణ.. జోహార్ వైఎస్సార్..' అని షర్మిల తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


తెలంగాణలో రాజన్న రాజ్యం ధ్యేయంగా గతేడాది జులైలో వైఎస్ షర్మిల 'వైఎస్సార్ తెలంగాణ పార్టీ'ని స్థాపించిన సంగతి తెలిసిందే. పార్టీకి ఈసీ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా.. ఆ పార్టీకి గుర్తింపునివ్వొద్దని పలువురు ఈసీకి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు షేక్ భాషా దీనిపై ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. వైఎస్సార్ పేరిట ఉన్న మరో పార్టీకి గుర్తింపునిస్తే అది ప్రజల్లో కన్ఫ్యూజన్‌కి దారితీస్తుందని షేక్ భాషా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.


ఈసీకి అందిన ఫిర్యాదులతో షర్మిల పార్టీకి గుర్తింపు ఆలస్యమవుతూ వచ్చింది. పలు సందేహాలు, ప్రశ్నలకు ఆ పార్టీ నుంచి ఈసీ వివరణలు కోరింది. దీంతో పార్టీకి అసలు గుర్తింపు వస్తుందా రాదా అన్న టెన్షన్ షర్మిలను వెంటాడింది. ఎట్టకేలకు పార్టీని స్థాపించిన దాదాపు 7 నెలలకు వైఎస్సార్ తెలంగాణ పార్టీకి గుర్తింపు దక్కడంతో షర్మిలకు బిగ్ రిలీఫ్ లభించినట్లయింది. పార్టీని ఈసీ గుర్తించడంపై వైఎస్సార్‌టీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Also Read: Bheemla Nayak Pre Release Event: పవన్ కల్యాణ్ స్పీచ్‌పై రాంగోపాల్ వర్మ కామెంట్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook