ED case On Note for Vote: తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసులో ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగింది. ఛార్జిషీటు దాఖలు చేసింది. ఆ ఛార్జిషీటులో..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో (Telangana) 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో అభ్యర్దికి మద్దతివ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో తెలుగుదేశం నేతలు బేరసారాలు చేశారు. టీడీపీ తరపున అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి ( Revant reddy) స్టీఫెన్‌సన్‌కు 50 లక్షల నగదు ఇవ్వజూపారు. ఇదంతా కెమేరాకు చిక్కడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. అదే సమయంలో రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి..స్టీఫెన్‌సన్‌తో మాట్లాడించడం ...అట్నుంచి మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ చంద్రబాబు చెప్పడం ఇదంతా అప్పట్లో ఓ సంచలనం. ఈ కేసులో సీఐడీ ఇప్పటికే విచారణ చేస్తోంది. ఇప్పుడీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) రంగంలో దిగి ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చి..వేం కృష్ణ, కీర్తన్ రెడ్డి, సెబాస్టియన్‌లతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి (Chandrababu) పాత్ర గురించి ఈడీ పేర్కొంది.


Also read: Telangana: తెలంగాణలో కొత్తగా 3,762 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook