హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 91,048 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా (covid-19 tests) వారిలో కొత్తగా 3,762 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 3,816 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. మరో 20 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 3,189 కి పెరిగింది. బుధవారం గుర్తించిన కరోనా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 5,63,903 పెరిగాయి.
Also read : Telangana CM KCR: వైద్య విద్యార్థులకు కూడా సీనియర్ రెసిడెంట్లకిచ్చే గౌరవ వేతనం
ఇప్పటివరకు 5,22,082 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ని (Lockdown in Telangana) పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా కరోనావైరస్ వ్యాప్తి కూడా తగ్గుముఖం పట్టినట్టు ప్రభుత్వం భావిస్తోంది. ఈనేపథ్యంలో ఈసారి కూడా లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook