KCR Family: దసరా సంబరాల్లో కేసీఆర్.. మనవడితో వీడియో కాల్ వైరల్
Ex CM KCR Celebrates Dusshera With Family: దసరా పండుగను కేసీఆర్ కుటుంబసమేతంగా చేసుకున్నారు. పండుగ సందర్భంగా కొడుకు, కోడలు, మనవళ్లతో ఆనందోత్సాహాలతో కేసీఆర్ గడిపారు.
KCR Dusshera Celebrations: తెలంగాణలో దసరా పండుగ సంబురంగా జరిగింది. పల్లె, పట్టణం పండుగ వాతావరణంలో మునిగాయి. ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పండుగ ఆనందంలో మునిగితేలారు. పండుగ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట సందడి వాతావరణం అలుముకుంది. అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన తొలి దసరా పండుగ సాదాసీదాగా జరిగింది. ఈ సందర్భంగా తన కుటుంబసభ్యులతో కేసీఆర్ ఆనందోత్సాహాలతో గడిపారు.
Also Read: Dusshera: దసరా సంబరాల్లో రేవంత్ రెడ్డి.. స్వగ్రామంలో అభివృద్ధి జాతర
హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో కేసీఆర్ తన సతీమణి శోభతో పాటు కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమ, మనవరాలు అలేఖ్యతో కలిసి దసరా పండుగ చేసుకున్నారు. పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం కుటుంబసభ్యులు కొత్త వస్త్రాలు ధరించారు. ఇంట్లో పూజల అనంతరం పిండి పదార్థాలు కుటుంబ సమేతంగా భోజనం చేశారు. అనంతరం సాయంత్రం పూట జమ్మి ఇచ్చి కేటీఆర్, శైలిమలు కేసీఆర్ దంపతుల ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను కేసీఆర్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత మనవరాలు అలేఖ్య నాన్నమ్మ, తాతలకు పాదాభివందనం చేసింది.
Also Read: Job Notification: నిరుద్యోగులకు దసరా గిఫ్ట్.. మరో భారీ ఉద్యోగ ప్రకటన విడుదల
అయితే కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు తొలిసారి దసరా పండుగకు దూరంగా ఉన్నాడు. విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లడంతో దసరా పండుగకు దూరమయ్యాడు. విదేశాల్లో ఉన్నా కూడా కుటుంబంతో నిత్యం మాట్లాడుతూ ఉన్నాడు. పండుగ సందర్భంగా తన తాత కేసీఆర్‌తో హిమాన్షు వీడియో కాల్‌లో మాట్లాడారు. కొన్ని నిమిషాల పాటు తాత మనవళ్లు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. అనంతరం నాన్నమ్మ శోభతోపాటు తల్లిదండ్రులు కేటీఆర్, శైలిమతో హిమాన్షు మాట్లాడారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కేసీఆర్, హిమాన్షు వీడియో కాల్ దృశ్యాలు బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు తమ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.
త్వరలో రంగంలోకి?
అయితే రాజకీయంగా కొంత విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ త్వరలోనే రంగంలోకి దిగనున్నారనే చర్చ జరుగుతోంది. ఆయన మౌనం ప్రళయానికి ముందు వచ్చే నిశ్శబ్ధం లాంటిది ప్రచారం నడుస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత కొంత రాజకీయాలకు దూరంగా ఉన్న కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జోరుగా ప్రచారం చేసి మళ్లీ ఇంటికే పరిమితమయ్యారు. 24 ఏళ్లు ఉద్యమం.. పదేళ్లు అధికారంతో తీరిక లేని జీవితం పొందిన కేసీఆర్ ఇప్పుడు కొంత విశ్రాంతి పొందుతున్నారు. కుటుంబానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో కేసీఆర్ రంగంలోకి దిగుతారని గులాబీ పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.