Dusshera: దసరా సంబరాల్లో రేవంత్‌ రెడ్డి.. స్వగ్రామంలో అభివృద్ధి జాతర

Revanth Reddy Dusshera Celebrations: తెలంగాణలోనే అతిపెద్ద పండుగ అయిన దసరాను రేవంత్‌ రెడ్డి తన స్వగ్రామంలో చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీగా అభివృద్ధి పనులు ప్రారంభించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 12, 2024, 05:27 PM IST
Dusshera: దసరా సంబరాల్లో రేవంత్‌ రెడ్డి.. స్వగ్రామంలో అభివృద్ధి జాతర

Dusshera 2024: అధికారంలోకి వచ్చాక తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రేవంత్‌ రెడ్డి చేరుకున్నారు. దసరా పండుగ సందర్భంగా స్వగ్రామంలో పర్యటించి సందడి చేశారు. గ్రామంలోనే దసరా పండుగ చేసుకుని అనంతరం అభివృద్ధి పనులు భారీగా ప్రారంభించారు. రేవంత్‌ రాకతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. కాగా ఆయన రాకతో పోలీసులు బందోబస్తు పటిష్టంగా నిర్వహించారు.

Also Read: Job Notification: నిరుద్యోగులకు దసరా గిఫ్ట్.. మరో భారీ ఉద్యోగ ప్రకటన విడుదల

 

నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో రేవంత్‌ రెడ్డి జన్మించిన విషయం తెలిసిందే. రుణమాఫీ సక్రమంగా అమలు చేయలేదనే వార్తతో కొండారెడ్డిపల్లి వార్తల్లో నిలిచింది. ఆ సందర్భంగా ఇద్దరు జర్నలిస్టులపై దాడి జరిగడంతో ఈ గ్రామంపై ప్రత్యేక చర్చ మొదలైంది. స్వగ్రామంలోనే పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు కావడం లేదనే విమర్శలతో రేవంత్‌ రెడ్డి సుదీర్ఘ కాలం తర్వాత స్వగ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానం తిప్పికొట్టాలనే ఉద్దేశంతో ఈ పర్యటన చేపట్టడం గమనార్హం.

Also Read: Revanth Reddy: కేసీఆర్ పిల్లలు రాజ్యాలు ఏలాలా? పేదల పిల్లలు బర్లు, గొర్రెలు కాయాల్నా?

 

అభివృద్ధి పనులు
రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ భవనం ఎదుట మామిడి మొక్కను నాటారు. అత్యాధునిక సదుపాయాలతో రూ.55 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రంథాలయ భవనానికి రిబ్బన్‌ కట్‌ చేశారు. ఈ భవనానికి అమర జవాను యాదయ్య పేరు పెట్టారు. రూ.70 లక్షలతో అధునాత సదుపాయాలతో కమ్యూనిటీ భవనం, ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభం జరిగాయి. రూ.32 లక్షల వ్యయంతో  చిన్నపిల్లల పార్క్, బహిరంగ వ్యాయామశాల (ఓపెన్‌ జిమ్‌) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.64 లక్షలతో అత్యాధునిక ప్రయాణ ప్రాంగణ (బస్టాండ్‌) నిర్మాణం, ప్రధాన రహదారి గుండా విద్యుత్ దీపాలంకరణ పనులకు భూమి పూజ చేశారు. రూ.45 లక్షలతో నిర్మించిన పశు వైద్యశాలను కూడా ప్రారంభించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News