గ్రేటర్ లో ఎన్నికల నగారా మోగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలెక్షన్స్ 2020 షెడ్యూల్ ను తెలంగాణ ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఎన్నికలను బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వహించనున్నారు. నామినేషన్స్ వేయడానికి చివరి తేదీని నవంబర్ 20,2020 గా నిర్ణయించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | ZH Fact Check: డిసెంబర్ 1న దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ పెట్టనున్నారా?  నిజం తెలుసుకోండి!


జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీ కాలం 2021 ఫిబ్రవరి 10న ముగియనుంది. 2016లో నిర్వహించిన వార్డుల ప్రకారమే ఈసారి ఎన్నికలు ( GHMC Elections 2020 ) నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధపారథి తెలిపారు. 
నామినేషన్
గ్రేటర్ హైదరాబాద్ ( Hyderabad ) ఎన్నికల నామినేషన్ ప్రక్రియను నవంబర్ 18న ప్రారంభించనున్నారు. నవంబర్ 20వ తేదీన నామినేషన్ వేయాల్సిన చివరి తేదీ. అయితే నామినేషన్లను ఈ నెల 21న పరిశీలించనున్నారు. నామినేషన్ విత్ డ్రా చేయడానికి చివరి తేదీ నవంబర్ 22. డిసెంబర్ 1వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అవసరాన్ని బట్టి డిసెంబర్ 3న రీ పోలింగ్ నిర్వహించనున్నారు.



Also Read | Aadhaar Card Updates: రూ.50కే పీవీసీ కార్డు, అన్‌లైన్‌లో ఆర్డర్ చేయోచ్చు


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR