GHMC Mayor Election: నువ్వా నేనా రీతిలో సాగిన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. గ్రేటర్ పీఠంపై కూర్చునేది ఎవరనేది తేలాల్సి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ( Greater Hyderabad Elections ) దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపాయి. అధికారపార్టీ టీఆర్ఎస్ ( TRS ) , బీజేపీ ( BJP ) మధ్య నువ్వానేనా రీతిలో పోటీ సాగింది. 2020 డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికలు ( Ghmc Elections ) జరగగా..4వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుని కారు వేగానికి బ్రేక్ వేసింది. స్పష్టమైన మెజార్టీ మాత్రం ఏ పార్టీకు రాని పరిస్థితి. టీఆర్ఎస్ పార్టీతో పోటీగా బీజేపీ స్థానాలు గెల్చుకుంది. దాంతో మేయర్  ( Mayor ) పీఠం ఎవరు కైవసం చేసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ( How ghmc mayor will be elected )


గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 150 స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ 56 స్థానాల్ని, బీజేపీ 48 స్థానాల్ని, ఎంఐఎం 44 స్థానాల్ని గెల్చుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలతో సరిపెట్టుకుంది. కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 76. ఈ నేపధ్యంలో మేయర్ ఎన్నికపై అందరిలో ఆతృత నెలకొంది. ఫిబ్రవరి 11న మేయర్‌ను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం  నోటిఫికేషన్ ( Ghmc mayor Notification ). ముందుగా  ఫిబ్రవరి 11 ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక సమావేశంలో మేయర్ ఎన్నిక జరుగుతుంది. మేయర్ ఎన్నిక తరువాత డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. ( Ghmc mayor election process ) ఏవైనా అనివార్య కారణాల వల్ల ఆ రోజు ఎన్నికల జరగకపోతే..మరుసటి రోజున అంటే 12వ తేదీన ఎన్నిక జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదైన  లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఓటు హక్కుంటుంది. ఈసారి మేయర్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. 


Also read: Telangana New IT Policy: త్వరలో కొత్త ఐటీ పాలసీ, మంత్రి కేటీఆర్ తీసుకున్న నిర్ణయాలివే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook