Telangana New IT Policy: త్వరలో కొత్త ఐటీ పాలసీ, మంత్రి కేటీఆర్ తీసుకున్న నిర్ణయాలివే

Telangana New IT Policy:  తెలంగాణలో నూతన ఐటీ పాలసీ రానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాలసీ ఐదేళ్లు పూర్తి కావస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని..మంత్రి కేటీఆర్ తెలిపారు.

Last Updated : Jan 23, 2021, 08:22 PM IST
Telangana New IT Policy: త్వరలో కొత్త ఐటీ పాలసీ, మంత్రి కేటీఆర్ తీసుకున్న నిర్ణయాలివే

Telangana New IT Policy:  తెలంగాణలో నూతన ఐటీ పాలసీ రానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాలసీ ఐదేళ్లు పూర్తి కావస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని..మంత్రి కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ ( Telangana ) నూతన రాష్ట్రం ఏర్పడ్డాక ప్రవేశపెట్టిన ఐటీ పాలసీ ( IT Policy ) త్వరలో ఐదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపధ్యంలో మరో కొత్త ఐటీ పాలసీ ( Telangana  New IT Policy ) ను తీసుకువస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటివరకూ అమల్లో ఉన్న పాలసీ ద్వారా ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందిందని..రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వచ్చాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఐటీ శాఖాధిపతులతో మంత్రి కేటీఆర్ ( Minister ktr ) సమీక్ష నిర్వహించారు. కొత్త పాలసీలో చేర్చాల్సిన అంశాల్ని సూచించారు. 

ఏ పాలసీ అయినా సరే  ప్రజల కేంద్రంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ( Cm kcr ) ఆలోచన అని..ఆ దిశగానే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకూ పలు నూతన విధానాల్ని రూపకల్పన చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ ( It Industry ) ను మరింతగా పటిష్టపర్చి..పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చేందుకు కొత్త నిర్ణయాల్ని తీసుకోనున్నామని కేటీఆర్ చెప్పారు. పెట్టుబడులతో పాటు ఐటీ ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. ఈ దిశగా ఇప్పటికే గత ఆరేళ్లుగా ఈ గవర్నెన్స్ ( E Governance ), ఆన్‌లైన్ , మొబైల్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ సేవల్ని అందించామని కేటీఆర్ ప్రస్తావించారు. పెట్టుబడులతో పాటు ఐటీ శాఖ ద్వారా ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవల పైన ప్రధాన దృష్టి సారించాలని, పౌరుడే కేంద్రంగా ప్రభుత్వ సేవలు అందించే విధానాలకు రూపకల్పన చేయాలని సూచించారు. 

ఆరేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో బలమైన ఇన్నోవేషన్ ఈకో సిస్టమ్ ( Innovation eco system ) ఏర్పడిందని..దీన్ని మరింతగా బలోపేతం చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా తీసుకెళ్లేవిధంగా కార్యక్రమాల్ని రూపొందించాలని కేటీఆర్ సూచించారు. ఆరేళ్ల కాలంలో నూతన పెట్టుబడుల్ని హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు రప్పించగలిగామన్నారు. స్థానిక యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు ప్రోత్సాహకాలు ప్రకటించామని చెప్పారు. 

Also read: EWS Reservation: తెలంగాణలో 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News