Student Cut Throat: గురుకుల పాఠశాలలో దారుణం..ఉప్మా చేయి మీద పడిందని గొంతు కోశాడు..!!
Student Cut Throat: సాధారణంగా పిల్లలు గొడవ పడితే తిట్టుకోవడమో, గొడవ పడటమో చేస్తుంటారు. కాకపోతే కొట్టుకుంటారు. మరుసటిరోజు కలిసిపోతారు. కానీ, హైదరాబాద్ గచ్చిబౌలిలో ఊహించని దారుణం చోటు చేసుకుంది.
Student Cut Throat: సాధారణంగా పిల్లలు గొడవ పడితే తిట్టుకోవడమో, గొడవ పడటమో చేస్తుంటారు. కాకపోతే కొట్టుకుంటారు. మరుసటిరోజు కలిసిపోతారు. కానీ, హైదరాబాద్ గచ్చిబౌలిలో ఊహించని దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య నెలకొన్న వివాదం ఏకంగా హత్యాయత్నానికి దారితీసింది. ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల మధ్య కుట్రలు, కక్షలు పొడసూపుతున్నాయి. చిన్న కారణానికే తీవ్రంగా ఆలోచిస్తున్నారు. తోటి విద్యార్థుల మధ్య సూపర్ హీరోగా కాలర్ ఎగరేసుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఫలితంగా విపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తల్లిదండ్రులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.
గచ్చిబౌలిలోని తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాలమీదకు తెచ్చింది. నిన్న రాత్రి హాస్టల్‌లో అల్పాహారం చేస్తున్న సమయంలో ఓ విద్యార్థి ప్లేట్‌లోని ఉప్మా.. మరో విద్యార్థి చేయిమీద పడింది. దీంతో, ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడే ఉన్న టీచర్ జోక్యం చేసుకోవడంతో అప్పటికైతే వివాదం సద్దుమణిగింది. కానీ, గొడవ పడ్డ ఇద్దరిలో ఒక విద్యార్థి కోపంతో రగిలిపోయాడు. అర్థరాత్రి సమయంలో కత్తితో తోటి విద్యార్థి గొంతు కోశాడు. బాధితుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఉపాధ్యాయులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఈ సంఘటనలో గాయపడ్డ విద్యార్థికి ప్రాణాపాయం లేదని వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు.. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Acharya Movie Trolls: ఆచార్య మూవీపై ట్విట్టర్ లో ఘోరమైన ట్రోలింగ్.. అసలు ఏమైంది?
Also Read: Kerala Shigella: కేరళలో మరోసారి 'షిగెల్లా' కలకలం.. కోజికోడ్‌లో తొలి కేసు నమోదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.