Kerala Shigella: కేరళలో మరోసారి 'షిగెల్లా' కలకలం.. కోజికోడ్​​లో తొలి కేసు నమోదు!

Shigella Case: కేరళ కోజికోడ్​లో షిగెల్లా కేసు బయటపడింది. ఏడేళ్ల బాలికలో ఈ వ్యాధి లక్షణాలు గుర్తించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి బాగానే ఉంది.   

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2022, 12:39 PM IST
Kerala Shigella: కేరళలో మరోసారి 'షిగెల్లా' కలకలం.. కోజికోడ్​​లో తొలి కేసు నమోదు!

Kerala Shigella Case news:  కేరళలో మరోసారి షిగెల్లా (shigella) కలకలం రేపింది. కోజికోడ్‌లోని పుత్తియప్పలో ఏడేళ్ల బాలికకు ఈ వ్యాధి సోకినట్లు అధికారులు గుర్తించారు. ఈ షిగెల్లా కేసు ఏప్రిల్ 27న నమోదైందన్న అధికారులు...ఇంకా ఎవరికీ వ్యాపించలేదని తెలిపారు. ఏప్రిల్ 20న బాలికలో షిగెల్లా లక్షణాలు గుర్తించిన అధికారులు.. ఆమెకు పరీక్షలు చేశారు. మలంలోని రక్తాన్ని టెస్ట్ చేస్తే పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు వారు వివరించారు.  బాలిక ఇంటిపక్కన ఉంటున్న మరో చిన్నారిలోనూ ఈ వ్యాధి లక్షణాలున్నాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతం చిన్నారుల ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వారు వెల్లడించారు. 

షిగెల్లా వ్యాధి లక్షణాలు (shigella symptoms)
** ప్రాథమిక లక్షణాలు: జ్వరం, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, అలసట మెుదలైనవి. 
** కలుషితమైన నీరు తాగడం వల్ల, చెడిపోయిన ఆహారం తినడం వల్ల ఈ వ్యాధి శరీరంలోకి ప్రవేశిస్తుంది. 
** ఈ వ్యాధి బ్యాక్టీరియా ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒకరి నుంచి ఒకరికి చాలా వ్యాగంగా వ్యాప్తి చెందుతుంది. 
** ఈ డిసీజ్ యెుక్క లక్షణాలు సాధారణంగా వారం రోజుల్లోపు బయటపడతాయి. ఐదేళ్లలోపు చిన్నారులకు ఈ వ్యాధి ప్రమాదకారి.

తీసుకోవాల్సిన జాగత్తలు: 
**  మంచి ఆహారం తీసుకోవాలి
** తరుచూ చేతులను శుభ్రం చేసుకోవాలి.
** వేడి నీటిని మాత్రమే తాగాలి.
** మల, మూత్ర విసర్జన ఎక్కడపడితే అక్కడ చేయకూడదు
** డిసీజ్ సోకిన వారు వంటలు చేయకపోవడం మంచిది. 

Also Read: Covid 19 Fourth Wave: దేశంలో ఇప్పటికే 'ఫోర్త్ వేవ్' మొదలైంది.. ప్రతీ ముగ్గురిలో ఒకరిది ఇదే అభిప్రాయం...

Also Read: Acharya Movie Trolls: ఆచార్య మూవీపై ట్విట్టర్ లో ఘోరమైన ట్రోలింగ్.. అసలు ఏమైంది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News