Heavy rain alert: హైదరాబాద్‌కి భారీ వర్షసూచన.. 3 రోజుల పాటు భారీ వర్షాలు
Heavy rain in Hyderabad: హైదరాబాద్‌కి భారీ వర్షసూచన ఉన్నట్టు జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం నగరంలో రాబోయే 72 గంటల పాటు భారీ వర్షాలు ( Heavy rainfall) కురిసే అవకాశం ఉందని చెప్పిన ఆయన.. కొన్ని చోట్ల 9 నుండి 16 సెంటిమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు.
Heavy rain in Hyderabad: హైదరాబాద్: నగరానికి భారీ వర్షసూచన ఉన్నట్టు జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం నగరంలో రాబోయే 72 గంటల పాటు భారీ వర్షాలు ( Heavy rainfall) కురిసే అవకాశం ఉందని చెప్పిన ఆయన.. కొన్ని చోట్ల 9 నుండి 16 సెంటిమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించిన కమినర్ లోకేష్ కుమార్ ( GHMC Commissioner Lokesh Kumar ).. భారీ వర్షాల కారణంగా సంభవించే వరదలను అదుపు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు అధికారులు వారి బృందాలతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. Also read : Nizamabad MLC Bypoll 2020: భారీ మెజార్టీతో కవిత విజయకేతనం
అతి భారీ వర్షాలతో ఏర్పడే వరద పరిస్థితిని ( Floods ) అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా జీహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేసి, వారిని అందుబాటులో ఉంచాలని జోనల్ కమిషనర్లు, డిప్యూటి కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు.
లోతట్టు ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి వీలుగా ఎక్కడికక్కడ పాఠశాలలు, కమ్యునిటీ హాల్స్, ఇతర వసతులను రిలీఫ్ సెంటర్లుగా సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. అధికారులు ఎవ్వరూ సెలవులపై వెళ్లరాదని, విధులకు అందుబాటులో ఉండాలని కమిషనర్ స్పష్టంచేశారు. Also read : COVID-19 Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe