Hyderabad Rain Alert: హైదరాబాద్ ను వదలని వర్షం.. కుండపోతతో జనాలకు నరకం
Hyderabad Rain Alert: హైదరాబాద్ ను వదల బొమ్మాళి అంటున్నాడు వరుణుడు. టైం టైబుల్ పెట్టుకున్నట్లుగా మరీ రోజూ తన ప్రతారం చూపిస్తున్నాడు. ఉదయం దంచికొడుతున్న వాన.. సాయంత్రం భారీ వర్షం కామన్ గా మారిపోయింది
Hyderabad Rain Alert: హైదరాబాద్ ను వదల బొమ్మాళి అంటున్నాడు వరుణుడు. టైం టైబుల్ పెట్టుకున్నట్లుగా మరీ రోజూ తన ప్రతారం చూపిస్తున్నాడు. ఉదయం దంచికొడుతున్న వాన.. సాయంత్రం భారీ వర్షం కామన్ గా మారిపోయింది హైదరాబాదీలకు. శనివారం ఉదయం కూడా ఎండ దంచికొట్టింది. మధ్యాహ్నానికే సీన్ మారిపోయింది. ఒక్కసారిగా దట్టమైన మబ్బులు అలుముకున్నాయి. నగరమంతా చీకటిగా మారిపోయింది. కాసేపటికే కుండపోతగా వర్షం కురిసింది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, యూసుఫ్ గూడ, మదాపూర్, అమీర్ పేట, మణికొండ, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కూకట్ పల్లిస మోతీనగర్ లో గాలివానతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో రోడ్లపైకి వరద చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ జామైంది. వాహనదారులు నరకం చూస్తున్నారు. హైదరాబాద్ కు ఐఎండీ భారీ వర్ష సూచన చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిస్తుందని అలర్ట్ చేసింది.
హైదరాబాద్ తో పాటు మెదక్, వికారాబాద్, సిద్దిపేట్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్,నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో ని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read : ఇదేందయ్యో ఇది నేను ఎప్పుడూ చూడలే.. అండర్‌వేర్‌ను మింగిన నాగుపాము! చివరకు
Also Read : Prithvi raj : భార్యకు నెలకు రూ. 8 లక్షల భరణం.. ధర్టీ ఇయర్స్ ఫృధ్వీకి కోర్టు షాక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి