Telangana: తెలంగాణలో టపాసులపై నిషేధం
దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి తీవ్రరూపం దాలుస్తుండటంతో.. దీపావళి పర్వదినాన (deepavali 2020) టపాసులు కాల్చడంపై ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ (Telangana) లో కూడా దీపావళి టపాసులను (Firecrackers Ban) ఖచ్చితంగా నిషేధించాలని హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Fire crackers Ban in Telangana: హైదరాబాద్: దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి తీవ్రరూపం దాలుస్తుండటంతో.. దీపావళి పర్వదినాన (deepavali 2020) టపాసులు కాల్చడంపై ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ (Telangana) లో కూడా దీపావళి టపాసులను (Firecrackers Ban) ఖచ్చితంగా నిషేధించాలని హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో.. టపాసులను ఖచ్చితంగా నిషేధించి తీరాలని ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టపాసులను నిషేధించాలని న్యాయవాది ఇంద్రప్రకాష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనివల్ల ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడతారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. Also read: NGT: ఢిల్లీలో నవంబరు 30 వరకు అన్ని రకాల టపాసులపై నిషేధం
దీనిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు టపాసులపై నిషేధం విధించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఎవ్వరూ కూడా టపాసులను అమ్మడం గానీ, కొనడం గాని చేయవద్దని ఆదేశించింది. నిషేధంపై ప్రభుత్వం విస్తృత ప్రచారం చేయాలని ధర్మాసనం సూచించింది. అయితే ఇప్పటి వరకు తెరిచిన దుకాణాలను మూసివేయాలని ఆదేశిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. Also read: Firecrackers in Diwali: టపాసులపై బ్యాన్ విధించిన 6 రాష్ట్రాలు..లిస్ట్ చెక్ చేయండి!
ఇదిలాఉంటే.. ఇపట్పికే ఢిల్లీ, రాజస్థాన్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, హర్యానాతో పాటు పలు రాష్ట్రాలు టపాసుల అమ్మకాలు, విక్రయాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కూడా ఢిల్లీ ఎన్‌సీఆర్, తదితర ప్రాంతాల్లో నవంబరు 31వరకు నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Also read: Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోస్తున్న రష్మీ..
Also read: Adah Sharma: అందంతో ఆకట్టుకుంటున్న ఆదా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe