Firecrackers in Diwali: టపాసులపై బ్యాన్ విధించిన 6 రాష్ట్రాలు..లిస్ట్ చెక్ చేయండి!

States Banned Use Of Firecrackers | దిపావళి రాబోతుంది. దాంతో భారతీయులంతా పండగ కోసం ముందుస్తుగా సిద్ధం అవుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనించి కొన్ని రాష్ట్రాలు టపాసులు కాల్చడంపై బ్యాన్ విధించాయి. 

Last Updated : Nov 7, 2020, 03:14 PM IST
    • దిపావళి రాబోతుంది. దాంతో భారతీయులంతా పండగ కోసం ముందుస్తుగా సిద్ధం అవుతున్నారు.
    • అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనించి కొన్ని రాష్ట్రాలు టపాసులు కాల్చడంపై బ్యాన్ విధించాయి.
    • కోవిడ్-19 పరిస్థితి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి.
    • టపాసులు కాల్చడం వల్ల వచ్చే కాలుష్యం కరోనావైరస్ సంక్రమణను మరింతగా పెంచే అవకాశం ఉంది.
Firecrackers in Diwali: టపాసులపై బ్యాన్ విధించిన 6 రాష్ట్రాలు..లిస్ట్ చెక్ చేయండి!

Diwali Firecrackers | దిపావళి రాబోతుంది. దాంతో భారతీయులంతా పండగ కోసం ముందుస్తుగా సిద్ధం అవుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనించి కొన్ని రాష్ట్రాలు టపాసులు కాల్చడంపై బ్యాన్ విధించాయి. కోవిడ్-19 ( Covid-19 ) పరిస్థితి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. టపాసులు కాల్చడం వల్ల వచ్చే కాలుష్యం కరోనావైరస్ సంక్రమణను మరింతగా పెంచే అవకాశం ఉంది.

Also Read | IRCTC New Booking Rules: IRCTC నుంచి టికెట్ చేస్తున్నారా ? ఈ కొత్త రూల్ తెలుసుకోండి!

టపాసులు కాల్చడంపై నిషేధం విధించిన రాష్ట్రాలివే.
ఢిల్లీ
( Delhi Banned Use Of Firecrackers in Diwali )
నవంబర్ 5న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కీలక ప్రకటన చేశారు. కరోనా కారణంగా ఈ సారి టపాసులు  కాల్చడంపై నిషేధం విధించినట్టు ఆయన తెలిపారు. పండగల కారణంగా కరోనావైరస్ సంక్రమణ ప్రమాదం మరింతగా పెరిగింది అని అందుకే ప్రజలు ఈ సారి టపాసులు కాల్చడం మానేయాలి అని.. కాలుష్యం వల్ల మరింత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అని ఆయన ప్రజలను కోరారు.

మహారాష్ట్ర (  Maharastrs Banned Use Of Firecracker in Diwali )
ఢిల్లీ ప్రకటన తరువాత మరుసటి రోజు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తమ పౌరులను టపాసులు కాల్చడం నుంచి దూరంగా ఉండమని అని కోరింది. అడిషనల్ మున్సిపల్ కమిషనర్ సురేష్ కాకాని ఈ మేరకు ఒక ప్రకటన చేసి టపాసులు కాల్చేవారిపై చర్యలు తీసుకుంటాం అన్నారు.

Also Read | Happy birthday Kamal Haasan: నటనతో పాటు కమల్ హాసన్ ఈ 5 విషయాల్లో దిట్ట అని తెలుసా ?

కర్ణాటక (  Karnataka Banned Use Of Firecrackers in Diwali )
నవంబర్ 6వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా టపాసులు కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో దీనిపై అధికారికంగా ఒక నిర్ణయం తీసుకుని వివరాలు చెబుతాం అని తెలిపారు. కరోనావైరస్ ( Coronavirus) వల్ల ఈ బ్యాన్ విధిస్తున్నట్టు వివరించారు.

పశ్చిమ బెంగాల్ ( West Bengal Banned Use Of Firecrackers in Diwali )
నవంబర్ 5వ తేదీన కాళీపూజ, దిపావళి ( Diwali ), ఛాత్ పూజ సందర్భంగా టపాసులు కాల్చడంపై ఆ రాష్ట్ర హైకోర్టు నిషేధం విధించింది. ఎలాంటి అమ్మకాలు చేయకూడదు అని స్పష్టం చేసింది.

Also Read | River in Thar: 2 లక్షల సంవత్సరాల ముందు ఎండిపోయిన నది జాడ దొరికింది

ఒడిశా ( Odisha Banned Use Of Firecrackers in Diwali )
నవంబర్ 3వ తేదీన ఒడిశా ప్రభుత్వం టపాసులు అమ్మడం, కాల్చడం నిషేధిస్తున్నట్టు ఒక ఆర్డర్ జారీ చేసింది. ఈ నిషేధం నవంబర్ 10 నుంచి 30 వరకు అమలులో ఉంటాయి.

రాజస్థాన్ ( Rajasthan Banned Use Of Firecrackers in Diwali )
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోఖ గెహ్లాట్ అందరి కన్నా ముందు టపాసులు కాల్చడంపై నిషేధం విధించారు. దీనిపై ఒక ట్వీట్ చేసి ప్రజలకు సమాచారం అందించారు. ప్రజల ఆరోగ్యం కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

Also Read | Zero Corona: కెనడాలోని ఈ ప్రాంతంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News