Heera Gold Case: దక్షిణాది రాష్ట్రాల్లోని ముస్లింల జీవితాలతో ఆడుకున్న హీరా గోల్డ్ స్కాం..కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. డిపాజిటర్లకు డబ్బులు ఎలా చెల్లిస్తారో నివేదిక రూపంలో స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర సంచలనమైన హీరా గోల్డ్ ( Heera Gold ) వ్యవహారంలో సుప్రీంకోర్టు ( Supreme court ) కీలక  వ్యాఖ్యలు చేసింది. కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న నౌహీరా షేక్ బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసుకుంది.  మరోవైపు ఈ కేసును సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌తో పాటు ఐపీసీ ప్రకారం విచారణ చేపట్టేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వం ( Telangana Government ) సుప్రీంకోర్టును కోరింది. ఈ రెండు పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. బెయిల్ మంజూరు చేయాలని..జైలు నుంచి బయటకొచ్చాక డిపాజిటర్ల డబ్బులు చెల్లిస్తామని నౌహీరా షేక్ ( Nowhera shaik ) తరపు న్యాయవాది తెలిపారు.


అయితే దీనిపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. డిపాజిట్లు చెల్లించేస్తామనే విషయాన్ని కేవలం నోటిమాటగా చెబితే ఎలా అని ప్రశ్నించింది. డిపాజిటర్ల డబ్బులు ఎలా చెల్లిస్తారనేది పదిరోజుల్లో నివేదిక రూపంలో సమర్పించాలని సుప్రీంకోర్టు కోరింది. 


Also read: Agrigold case: అగ్రి గోల్డ్ నిందితులకు 14 రోజుల రిమాండ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter