Huzurabad Bypoll: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ ఉపఎన్నిక మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో అనివార్యమైన ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక (Huzurabad Bypoll)ఇవాళ జరగనుంది. ఈసారి పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ జరగనుండటం విశేషం. హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం 306 పోలింగ్ స్టేషన్లు సిద్ధమయ్యాయి. మొత్తం 2 లక్షల 37 వేల 22 మంది ఓటర్ల తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈసారి ఈటెల రాజేందర్ బీజేపీ తరపున బరిలో ఉన్నారు. ఈటెల వర్సెస్ టీఆర్ఎస్‌గా మారిన ఈ ఉపఎన్నిక అత్యంత ప్రతిష్ఠాత్మకమైపోయింది. 


అభివృద్ధి పేరుతో టీఆర్ఎస్, ఆత్మగౌరవం పేరుతో ఈటెల రాజేందర్(Etela Rajender) ప్రజలకు చేరువయ్యే ప్రయత్నంలో నువ్వా నేనా రీతిలో పోటీ సాగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ నేతలు హుజూరాబాద్‌లోనే మకాం వేసి ప్రచారం కొనసాగించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితంపై భారీగా పందేలు కాస్తున్నారు. కోవిడ్ నిబంధల మేరకు గతంలో 48 గంటలున్న ప్రచారం విరామం ఈసారి 72 గంటలకు పెరిగింది. అటు పోలింగ్ సమయం కూడా ఏకంగా 12 గంటలపాటు కొనసాగనుంది. ప్రచారం చివరి రోజుల భారీగా డబ్బుల పంపిణీ జరిగిందనే ప్రచారం సాగుతోంది. మరోవైపు బీజేపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్ నిన్న మీడియా సమావేశం నిర్వహించాలని ప్రయత్నించగా..అధికారులు అడ్డుకున్నారు. ఎన్నికల ప్రచారం విరామం నేపధ్యంలో ప్రెస్ మీట్లకు కూడా అనుమతి లేదు. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఉపఎన్నిక సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటైంది. 


2021 ఏప్రిల్ నెలలో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిణామాల నేపధ్యంలో మంత్రి ఈటెల రాజేంద్ర పదవికి దూరమయ్యారు. 2004 నుంచి అంటే టీఆర్ఎస్(TRS) ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కీలక నేతగా ఆరుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన ఈటెల రాజేందర్ భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ తరువాత ఆయనపై కేసు నమోదు కావడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ(BJP) తీర్ధం పుచ్చుకోవడం జరిగిపోయాయి. ఈసారి టీఆర్అస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో నిలిచారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని టీఆర్ఎస్ విశ్వాసంగా ఉంటే..ఆత్మగౌరవం నినాదంతో గెలిపించాలని ఈటెల రాజేందర్ కోరుతున్నారు. 


Also read: Badvel Bypoll: బద్వేలు ఉపఎన్నిక నేడే, పోలింగ్ రాత్రి 7 గంటల వరకూ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook