Hyderabad: వ్యభిచారం చేయాలని 16 ఏళ్ల కూతురిపై తల్లి ఒత్తిడి-కేసు నమోదు చేసిన పోలీసులు
Woman booked for forcing her daughter into Prostitution: కన్న కూతురిని వ్యభిచారం రొంపిలోకి దింపేందుకు యత్నిస్తున్న ఓ మహిళపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓవైపు కూతురితో బలవంతంగా భిక్షాటన చేయిస్తూనే... మరోవైపు ఆమెను వ్యభిచారం చేయాల్సిందిగా ఆ మహిళ ఒత్తిడి తెస్తోంది.
Woman booked for forcing her daughter into Prostitution: కన్న కూతురితో భిక్షాటన చేయిస్తూ వ్యభిచారం (Prostitution) చేయాలని ఆమెపై ఒత్తిడి తెస్తున్న ఓ తల్లిపై హైదరాబాద్ (Hyderabad) పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల బాధిత బాలికను చైల్డ్ లైన్ సంస్థ ప్రతినిధులు ఖమ్మంలో గుర్తించారు. బాలికను తమ సంరక్షణలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. తల్లి ఆగడాలపై బాలిక ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో బాలిక తల్లిపై కేసు నమోదైంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని (Banjarahills) రోడ్ నం.2లో ఓ మహిళ తన తన కుమార్తె (16)తో కలిసి నివసిస్తోంది. కొన్నాళ్లుగా కూతురితో ఆమె భిక్షాటన చేయిస్తోంది. ఇదే విషయంపై ఈ ఏడాది నవంబర్ 28న చైల్డ్ లైన్ (Childline) సంస్థకు ఫిర్యాదు అందింది. అమీర్‌పేట్ ప్రాంతంలోని ఓ ఆలయం వద్ద మైనర్ బాలికతో ఆమె తల్లి భిక్షాటన చేయిస్తున్నట్లు ఓ వ్యక్తి చైల్డ్ లైన్‌కు సమాచారమిచ్చాడు. దీంతో చైల్డ్ లైన్ ప్రతినిధి మహేశ్వరి అక్కడికి వెళ్లగా... అప్పటికే తల్లీకూతుళ్లు అక్కడినుంచి వెళ్లిపోయారు.
ఇదే క్రమంలో ఈ నెల 6న ఖమ్మం (Khammam) బస్టాండ్ వద్ద బాధిత బాలికను చైల్డ్ లైన్ ప్రతినిధులు గుర్తించారు. బాలిక హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చినట్లు తెలుసుకుని... తమ సంరక్షణలోకి తీసుకున్నారు. తల్లి తనతో బలవంతంగా భిక్షాటన చేయించడంతో పాటు వ్యభిచారం చేయాలని వేధిస్తోందని బాలిక చైల్డ్ లైన్ ప్రతినిధులతో చెప్పింది. దీనిపై ఖమ్మం చైల్డ్ లైన్ ప్రతినిధులు హైదరాబాద్‌లోని (Hyderabad) బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు బాలిక తల్లిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక పారిపోయినా ఆమె తల్లి ఫిర్యాదు చేయకపోవడంపై చైల్డ్ లైన్ ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కన్న తల్లేనా కాదా అన్న దానిపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.
Also Read: Mahesh Babu: స్టన్నింగ్, మైండ్ బ్లోయింగ్-ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌పై మహేష్ బాబు రియాక్షన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook