Hyderabad: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం-ఇద్దరు అక్కడికక్కడే మృతి

Road accident in Banjarahills: మద్యం మత్తులో అతివేగంతో కారు నడిపిన యువకులు ఇద్దరి అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2021, 06:49 PM IST
  • హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కారు బీభత్సం
  • మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన యువకులు
  • ఇద్దరు పాదాచారులను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి
 Hyderabad: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం-ఇద్దరు అక్కడికక్కడే మృతి

Road accident in Banjarahills: హైదరాబాద్ (Hyderabad) బంజారాహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు ఇద్దరు పాదాచారులను ఢీకొట్టింది. దీంతో ఆ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం తర్వాత నిందితులు అదే కారులో పరారవగా.. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం (డిసెంబర్ 5) అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్‌లోని (Banjarahills) రెయిన్ బో ఆసుపత్రిలో పనిచేసే త్రిభువన్ రాయ్ (23), ఉపేందర్ కుమార్ దాస్ (29) ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ రోడ్ నం.2 వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన కారు ఇద్దరిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

ప్రమాదం తర్వాత నిందితులు పరారవగా పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నట్లు సమాచారం. మద్యం మత్తులో కారు నడపడం వల్లే (Speedy car hits pedestrians) ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో ఆ కారులో ఇద్దరు యువకులు ఉన్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రమాదంలో మృతి చెందిన త్రిభువన్ రెయిన్‌బో ఆసుపత్రిలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నాడని... అదే ఆసుపత్రిలో ఉపేందర్ దాస్ అసిస్టెంట్ కుక్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. 

కాగా, మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం కావొద్దని పోలీసులు ఎన్నిసార్లు వినిపించినా కొంతమంది మందు బాబులు పట్టించుకోవట్లేదు. తమ నిర్లక్ష్యంతో అమాయకుల ప్రాణాలను వారు బలిగొంటున్నారు. గతంలోనూ హైదరాబాద్‌లో (Hyderabad) ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం పంజాగుట్టలో చోటు చేసుకున్న ఘటనలో రమ్య అనే చిన్నారి, ఆమె తండ్రి మృతి చెందారు. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు ఇద్దరి ప్రాణాలు బలిగొన్నారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.

Also Read: ఇతర మహిళలకు లేనిది నేను చూపించినా.. హాట్ వీడియోపై ఫైర్ అయిన పాయల్‌ రాజ్‌పుత్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News