Mahesh Babu: స్టన్నింగ్, మైండ్ బ్లోయింగ్-ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌పై మహేష్ బాబు రియాక్షన్...

Mahesh Babu reaction on RRR Trailer: సూపర్ స్టార్ మహేష్ బాబు ఆర్ఆర్ఆర్ చిత్ర ట్రైలర్‌పై ట్విట్టర్‌లో స్పందించారు. ట్రైలర్‌లోని ప్రతీ సన్నివేశం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. గురువారం (డిసెంబర్ 9) విడుదలైన ఈ ట్రైలర్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2021, 10:49 AM IST
  • ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌పై సినీ సెలబ్రిటీల రియాక్షన్స్
  • ట్విట్టర్‌లో స్పందించిన సూపర్ స్టార్ మహేష్ బాబు
  • ప్రతీ సన్నివేశం అద్భుతమంటూ ప్రశంసించిన మహేష్
Mahesh Babu: స్టన్నింగ్, మైండ్ బ్లోయింగ్-ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌పై మహేష్ బాబు రియాక్షన్...

Mahesh Babu reaction on RRR Trailer: ఉత్కంఠ భరితమైన, భావోద్వేగపూరితమైన సన్నివేశాలు... రోమాలు నిక్కబొడిచే పోరాటాలు... ఆద్యంతం యాక్షన్ ప్యాక్డ్ విజువల్స్... చూపు తిప్పుకోనివ్వని ఎన్టీఆర్, రాంచరణ్‌ల (NTR Ramcharan RRR) ఎక్స్‌ప్రెషన్స్... మొత్తంగా జక్కన చెక్కుతున్న ఆర్ఆర్ఆర్ ఎంత అద్భుతంగా ఉండబోతుందో ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్‌ను ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ ట్రైలర్‌పై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు.

'ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌లోని (RRR Trailer) ప్రతీ సన్నివేశం ఒక అద్భుతం... మైండ్ బ్లోయింగ్.. మాస్టర్ స్టోరీ టెల్లర్ మళ్లీ వచ్చేశాడు... ఎలా అంటే... అంతా గూస్ బంప్సే...' అని మహేష్ బాబు తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మహేష్ బాబు చెప్పినట్లు కథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో రాజమౌళికి (SS Rajamouli) తిరుగులేదనే చెప్పాలి. తెరపై నవరసాలను ఆవిష్కరిస్తూ అద్భుతమైన నెరేషన్‌తో ప్రేక్షకుడిని కథలో లీనం చేయగలరు. అందుకే చిత్రసీమలో అపజయమే ఎరగని దర్శకుడిగా జక్కన్న దూసుకుపోతున్నారు.

ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌పై (RRR) ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. హీరో విజయ్ దేవరకొండ... 'నెక్ట్స్ లెవల్ సినిమా...' అంటూ రియాక్ట్ అవగా..  దర్శకుడు సందీర్ రెడ్డి వంగా 'ఇది కచ్చితంగా ఆ దేవుడే చేసి ఉంటాడు...' అని పేర్కొన్నాడు. బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ సైతం ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించారు. 'రాజమౌళి సార్... ఈ ఎపిక్ ట్రైలర్‌ బ్రిలియన్స్, మ్యాగ్నిట్యూడ్‌ ఆశ్చర్యపోయేలా చేసింది. చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు...' అని పేర్కొన్నాడు.

ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌లో రాంచరణ్, ఎన్టీఆర్‌ల మాస్ డైలాగ్స్ అద్భుతంగా పేలిన సంగతి తెలిసిందే. 'తొంగి తొంగి నక్కి నక్కి కాదే... తొక్కుకుంటూ పోవాలే. ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలి..' అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్,  'ఈ నక్కల వేట ఎంతసేపు... కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా...' అంటూ రాంచరణ్ చెప్పే డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. యూట్యూబ్‌లో విడుదలైన ఈ ట్రైలర్ (RRR Trailer) ఇప్పటికే 20 మిలియన్ల వ్యూస్ దాటేసింది. వచ్చే జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

Also Read: Bird Flu Kerala: కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ వ్యాప్తి.. అలప్పుజ జిల్లాలో వాటిపై నిషేధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News