HYDRA Demolitions: హైదరాబాద్‌ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కఠినంగానే ఉంటుందని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ప్రకటించారు. వచ్చే ఏడాది అత్యాధునిక పరిజ్ఞానంతో.. అన్ని సౌకర్యాలు కల్పించుకుని వస్తామని తెలిపారు. తమకు ప్రభుత్వం ప్రత్యేక అధికారాలను ఇచ్చిందని వెల్లడించారు. హైడ్రా వల్ల ప్రజల్లో భూములు, ఇల్లు క్రయవిక్రయాలపై అవగాహన పెరుగుతుందని చెప్పారు. జూలై తర్వాత అనధికారికంగా వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేవాటిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జనవరి నుంచి ప్రతి సోమవారం హైడ్రా ప్రజా వాణి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: K Kavitha: స్థానిక ఎన్నికలపై రేవంత్‌ రెడ్డికి కల్వకుంట్ల కవిత ఆల్టిమేటం.. లేకుంటే అడ్డుకుంటాం


హైడ్రాపై శనివారం వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కమిషనర్‌ రంగనాథ్‌ మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు. 'హైడ్రా ఏర్పడి దాదాపు 5 నెలలు దాటింది. ఐదు నెలల అనుభవాలతో వచ్చే ఏడాదికి రూట్‌మ్యాప్ సిద్దం చేశాం' అని తెలిపారు. ఓఆర్‌ఆర్ వరకు హైడ్రా పరిధి ఉందని ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ చట్టం కింద ప్రభుత్వం ప్రత్యేక అధికారాలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పటివరకు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించామని వివరించారు.

Also Read: Traffic E Challan: ట్రాఫిక్‌ ఈ చలాన్ల డిస్కౌంట్లు.. పోలీస్‌ శాఖ సంచలన ప్రకటన


'హైడ్రాతో 12 చెరువులు.. 8 పార్కులను అన్యాక్రాంతం కాకుండా రక్షించాం. ఎఫ్‌టీఎల్ , బఫర్ జోన్‌పై ప్రజల్లో అవగాహన పెరిగింది. 1,095 చెరువుల్లో వచ్చే ఏడాది ఎఫ్‌టీఎల్ నిర్దారణ చేస్తాం. సాంకేతిక పరిజ్ఞానం.. డాటాతో ఎఫ్‌టీఎల్ నిర్దారణ చేస్తాం' అని కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. ఎఫ్‌టీఎల్‌ను పారదర్శకంగా చేయడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. శాటిలైట్ చిత్రాలతో అత్యంత రెజల్యూషన్ ఉన్న డేటా తీసుకుంటున్నాం. 2006 నుంచి 2023 వరకు ఏరియల్ డ్రోన్స్‌తో తీసిన ఫొటోలను కూడా ఎఫ్‌టీఎల్ నిర్దారణ కోసం తీసుకుంటున్నాం' అని వెల్లడించారు.


హైడ్రాకు 5,800 ఫిర్యాదులు అందాయని కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. 'అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 పురపాలక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. 27 పురపాలక సంఘాలపై కూడా మాకు అధికారం ఉంది' అని ప్రకటించారు. శాటిలైట్ చిత్రాల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నట్లు చెప్పారు. భవన నిర్మాణ వ్యర్థాల డంపింగ్ పై కూడా దృష్టి పెట్టామన్నారు. 2025లో జియో ఫెన్సింగ్ సర్వే చేస్తామని వెల్లడించారు. 12 చెరువుల పునరుద్దరణకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు వివరించారు. త్వరలోనే 72 డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులోకి వస్తాయన్నారు. హైడ్రాకు త్వరలో ఒక ఎఫ్‌ఎం ఛానల్‌కు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యమిచ్చి పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.