K Kavitha: స్థానిక ఎన్నికలపై రేవంత్‌ రెడ్డికి కల్వకుంట్ల కవిత ఆల్టిమేటం.. లేకుంటే అడ్డుకుంటాం

K Kavitha Meets With BC Leaders: స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆల్టిమేటం జారీ చేశారు. ఆ పని చేశాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. 

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 27, 2024, 04:15 PM IST
K Kavitha: స్థానిక ఎన్నికలపై రేవంత్‌ రెడ్డికి కల్వకుంట్ల కవిత ఆల్టిమేటం.. లేకుంటే అడ్డుకుంటాం

Telangana Local Body Elections: బీసీ సమస్యలపై ఉద్యమ బాటకు సిద్ధమవుతున్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ మేరకు ఓ కీలక ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎత్తిచూపుతూ బీసీ కుల గణన వివరాలు వెల్లడించాక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: KCR Condolence: మాజీ సీఎం కేసీఆర్‌ సంతాపం.. మన్మోహన్‌ సింగ్‌తో కేసీఆర్‌ది విడదీయరాని బంధం

హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం బీసీ సంఘాల నాయకులతో కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. 'బీసీల రిజర్వేషన్ పెంపుపై స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు జరపడానికి వీలు లేదు. బీసీల జనాభా ఎంతో తెలియంది హామీ ఎలా ఇచ్చారు?' అని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో పేర్కొందని గుర్తుచేశారు.

Also Read: Traffic E Challan: ట్రాఫిక్‌ ఈ చలాన్ల డిస్కౌంట్లు.. పోలీస్‌ శాఖ సంచలన ప్రకటన

'జనాభాలో సగానికిపైగా బీసీలు ఉన్నారు. కానీ 42 శాతం అని కాంగ్రెస్ పార్టీ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదు. ఆ 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలు నిర్వహిస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరగనివ్వం' అని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. మండల కేంద్రాల్లో, జిల్లాల్లో నిరసన ప్రదర్శన చేస్తామని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

'బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చాక బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ఎన్నికలపై ఆలోచన చేయాలి' అని ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా జనవరి 3వ తేదీన ఇందిరా పార్కు వద్ద భారీ సభను నిర్వహిస్తామని ప్రకటించారు. జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ఏటా రూ.20 వేల కోట్లు బీసీలకు బడ్జెట్ కేటాయిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిందని గుర్తుచేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News