Rains in Telangana: ఇవాళ తెలంగాణకు వర్ష సూచన.. అక్కడక్కడా తేలికపాటి జల్లులు..
Rains in Telangana: తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Rains in Telangana: తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ (India Meteorological Department) వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాజస్తాన్ నుంచి విదర్భ ప్రాంతం మీదుగా ఉత్తర తెలంగాణ వరకు 1500మీ ఎత్తున ఉపరితల ద్రోణి కేంద్రీకృతమైనట్లు పేర్కొంది. దీంతో తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని... వాటి ప్రభావంతో బుధవారం (డిసెంబర్ 29) తేలికపాటి జల్లులు పడుతాయని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో మంగళవారం (డిసెంబర్ 28) అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిశాయి. మంగళవారం అత్యల్పంగా రంగారెడ్డి (Rangareddy) జిల్లా కసలాబాద్‌లో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొన్నిచోట్ల సాధారణం కన్నా కొంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
అటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి గురువారం (డిసెంబర్ 30) నుంచి 3 రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. చిత్తూరు జిల్లా ఆరోగ్యవరంలో మంగళవారం 15.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. తూర్పు గాలులు, మంచు ప్రభావంతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు (Weather Report) సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. మరో రెండు రోజుల్లో తూర్పు గాలులు మరింత బలపడే అవకాశం ఉంది. బంగాళాఖాతం మీదుగా కోస్తా వరకు వీస్తున్న గాలుల ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు ఆవరిస్తోంది. దీంతో ఉదయం పూట వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
Also Read: Horoscope Today, 29 December 2021: ఆ రాశి వారికి కెరీర్ పరమైన నిర్ణయాలకు అనువైన రోజు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook