Horoscope 29 December 2021 : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి కెరీర్ పరమైన నిర్ణయాలకు అనువైన రోజు

Horoscope 29 December 2021 : కొన్ని రాశుల వారికి ఈరోజు కొంత ఒత్తిడి, ఇబ్బందులు ఎదురవుతాయి. ఆశావాదంతో ముందుకు సాగితే కొన్ని పనులు పూర్తి చేస్తారు. కెరీర్ పరమైన నిర్ణయాలకు ఈరోజు అనువైన సమయం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2021, 09:06 AM IST
  • కొన్ని రాశుల వారికి ఇవాళ ప్రతికూల సమయం
  • కొన్ని విషయాల్లో ఒత్తిడి, ఇబ్బందులు తప్పవు
  • మీన రాశి వారికి కెరీర్ పరమైన నిర్ణయాలకు అనువైన రోజు
Horoscope 29 December 2021 : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి కెరీర్ పరమైన నిర్ణయాలకు అనువైన రోజు

Horoscope 29 December 2021 : కొన్ని రాశుల వారికి ఈరోజు కొంత ఒత్తిడి, ఇబ్బందులు ఎదురవుతాయి. ఆశావాదంతో ముందుకు సాగితే కొన్ని పనులు పూర్తి చేస్తారు. కెరీర్ పరమైన నిర్ణయాలకు ఈరోజు అనువైన సమయం.

మేషం : కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సంబంధాలు మరింత మెరుగవుతాయి. దీర్ఘకాలంగా వాయిదా వేసిన ఆర్థిక సమస్యను ఎట్టకేలకు పరిష్కరించగలుగుతారు. వ్యాపారానికి ఈరోజు అన్నివిధాలా అనుకూల సమయం. లక్కీ కలర్ : పీచ్, లక్కీ నంబర్ : 8

వృషభం : ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు. అసహనమే పెద్ద శత్రువు అనే విషయాన్ని గుర్తెరగాలి. క్లిష్టమైన ఆర్థిక సమస్యలను విజయవంతంగా పరిష్కరించగలరు. దీర్ఘకాలంలో ఆర్థిక భద్రత కోసం మార్గాలను అన్వేషించండి. లక్కీ కలర్: ఆక్వా-బ్లూ, లక్కీ నంబర్ : 5

మిథునం : ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు అవసరమవుతాయి. మెరుగైన దృక్పథంతో ఆ నిర్ణయాలు ఉండాలి. లక్కీ కలర్ : కుంకుమ, లక్కీ నంబర్ : 3

కర్కాటకం : మీ ఆశావాదమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారంలో కొంత ప్రతికూలత ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాములతో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. ఈరోజు ఎలాంటి ఒప్పందాలపై సంతకం చేయవద్దు. లక్కీ కలర్ : ఊదా, లక్కీ నంబర్ : 2

సింహం : మీ పై అధికారి లేదా పెద్దవారితో విభేదాలు ఉంటే... వాటి పట్ల అతిగా స్పందించకండి. ఆ వ్యవహారాల్లో అతిగా ప్రవర్తించకండి. ఆరోగ్య పరంగా అంతా బాగుంటుంది. కానీ ఎటువంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఒత్తిడి, అధిక పని కాస్త ఇబ్బందిపెడుతాయి. లక్కీ కలర్ : లెమన్, లక్కీ నంబర్ : 7

కన్య : జీవితంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాలు కొన్ని సంక్లిష్ట సందర్భాలకు దారితీస్తాయి. తద్వారా ఎవరిని విశ్వసించాలనే విషయంలో అయోమయం, గందరగోళానికి గురవుతారు. కుటుంబ సమస్యలకు తెరపడే సమయం ఆసన్నమైంది. మీ ప్రేమ జీవితం కొంత నిధానిస్తుంది. మీ భవిష్యత్‌కి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకునేందుకు అనువైన సమయం.  లక్కీ కలర్ : రాగి, లక్కీ నంబర్: 6

తుల : ఇతరుల మద్దతు, గౌరవం చూరగొంటారు. తీర్థయాత్రకు వెళ్లే అవకాశం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. వేడుకల్లో పాల్గొనడం, పాత స్నేహితులతో కలవడం జరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో ఎక్కడికైనా పర్యటించే అవకాశం. లక్కీ  కలర్: కాఫీ, లక్కీ నంబర్ : 4

వృశ్చికం: కొన్ని అనుకోని పనులు, ఆవిష్కరణలు జరగవచ్చు. పనిలో ఘర్షణ వాతావరణం లేకుండా చూసుకోండి. ఇతరులు చేసేవి, చెప్పేవి గమనిస్తే విలువైన సమాచారం తెలుసుకోవచ్చు. వ్యక్తిగత జీవితం బాగుంటుంది. కొత్త పనులు ప్రారంభించవచ్చు. లక్కీ కలర్ : అల్లం, లక్కీ నంబర్ : 9

ధనుస్సు : మీ శక్తి, స్థాయి మరింత మెరుగవుతుంది. వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లకు ఎదురీదుతారు. పరిణతి చెందిన వ్యక్తి ఇచ్చే సలహా మీ జీవితంలో ఇటీవల జరిగిన నాటకీయ సంఘటనల నుంచి మీకు ఓదార్పును, ఉపశమనాన్ని ఇస్తుంది. లక్కీ కలర్ : జేడ్, లక్కీ నంబర్: 5

మకరం : మీ సన్నిహితులు మీపై ఎక్కువ బాధ్యతలను మోపవచ్చు. ఆవేశపూరిత నిర్ణయాలు పనిచేయవు. ప్రశాంత మనసుతో నిర్ణయాలు తీసుకోవాలి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. లక్కీ కలర్: బూడిద, లక్కీ నంబర్: 1

కుంభం : కొన్ని విషయాల్లో రాజీతత్వం పనిచేయదు. కొంతమంది వ్యక్తులతో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇలాంటి విషయాలను దౌత్యపరంగా ఎదుర్కోవాలి. ఉమ్మడి ఆదాయాలు, పెట్టుబడులు, పన్నులు, భీమా, ఆస్తి పరిష్కారాలపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావం ఉంటుంది. లక్కీ కలర్ : మావ్, లక్కీ నంబర్ : 6

మీనం : చాలా ఏళ్లుగా మీకు దూరమైన బంధువు లేదా సన్నిహితులు మళ్లీ దగ్గరవుతారు. ఇరువురి కుటుంబాలు కలిసి కొంత సమయాన్ని గడుపుతాయి. పిల్లలు మీ సూచనలను స్వీకరిస్తారు, ఏ విషయంలోనూ పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. కెరీర్ పరంగా ఈరోజు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. లక్కీ కలర్ : ఐవరీ, లక్కీ నంబర్: 4

Also Read: New Year offer : మందు బాబులకు గుడ్ న్యూస్.. డిసెంబర్‌‌ 31న అప్పటి వరకు వైన్‌ షాప్స్‌ ఓపెన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News