IT and ED Raids On Gangula Kamalakar: తెలంగాణ రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ సీనియర్ నేత, మంత్రి గంగుల కమలాకర్ ఇంటి మీద ఐటీ అధికారులు రైడ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా నేతలపై ఇలా రైడ్స్ జరుగుతూనే ఉంటాయి కానీ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో లేని సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో దుబాయ్ పర్యటనలో ఉండగా ఈ రైడ్ జరగడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంత్రి గంగుల కమలాకర్ నివాసాలు ఆయన కార్యాలయాలు అలాగే ఆయనకు చెందిన పలు వ్యాపార సంస్థలపై ఏకకాలంలో ఐటీ అధికారులు, ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ తో పాటు కరీంనగర్లోని గంగుల కమలాకర్ ప్రాపర్టీ లపై ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. గంగుల కమలాకర్ కు చెందిన శ్వేత గ్రానైట్ సంస్థతో పాటు కరీంనగర్లోని మహావీర్ ఎస్వీఆర్ గానేట్స్ కార్యాలయాల్లో కూడా ఈడీ ఐటీ, అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.


సోదాలు నిర్వహిస్తున్న సమయంలో గంగుల కమలాకర్ కుటుంబం అంతా దుబాయ్ లో ఉండగా పోలీసుల సమక్షంలో ఐటీ, ఈడీ అధికారులు తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ దాడులు విషయం తెలియగానే కమలాకర్ హుటాహుటిన దుబాయ్ నుంచి హైదరాబాద్ బయలుదేరినట్లుగా తెలుస్తోంది. కేవలం కమలాకర్ ఆస్తుల మీదే కాకుండా కమలాకర్ సోదరులపై ఆస్తులపై కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. గంగుల కమలాకర్ తో పాటుగా కరీంనగర్కు చెందిన పలు ఇతర గ్రానైట్  వ్యాపారుల మీద కూడా ఈ రైడ్స్  జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.


ఈ గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారాలు చేసినట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు అందిందని ఆ ఫిర్యాదు ఆధారంగానే మంత్రి గంగుల సహా ఆ వ్యాపారంలో ఉన్న వారిపై రైడ్స్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయం మీద ఐటీ అధికారుల నుంచి గాని ఈడీ అధికారుల నుంచి గాని ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అయితే బయటకు రాలేదు. ఈ రైడ్స్ పూర్తయిన తర్వాత పూర్తి సమాచారం బయటకు వెల్లడించే అవకాశం ఉంది. ఏకకాలంలో 30 బృందాలుగా విడిపోయిన అధికారులు పలు ప్రాంతాల్లో రైట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


అయితే తెలంగాణలో అధికార టీఆర్ఎస్ అలాగే బీజేపీ మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణం నెలకొన్న క్రమంలో తమ నేతల మీద సీబీఐ సహా ఐటీ, ఈడీ దృష్టి పెట్టే అవకాశం ఉందని టీఆర్ఎస్ ముందు నుంచి కామెంట్స్ చేస్తోంది,  అందుకు తగినట్లుగానే గంగుల కమలాకర్ మీద ఐటీ, ఈడీ దాడులు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే సీబీఐ నేరుగా రాష్ట్రంలో ఎలాంటి విచారణ చేసే అధికారం లేకుండా ప్రభుత్వం జీవో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఐటీ ఈడీ అధికారులను మాత్రం ప్రభుత్వం నివారించే అవకాశం లేదు.


Also Read: Chandra Grahan Time: చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఈ సమయాల్లో ఆలయాలు మూసివేత


Also Read: Rahul Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే... రాహుల్ గాంధీ హామీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook