KTR TARGET BJP:  టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. సోషల్ మీడియా వేదికగా మోడీ ప్రభుత్వంపై కొన్ని రోజులుగా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. తాజాగా మరోసారి బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈసారి ఉచిత పథకాలపై బీజేపీ వైఖరిని ఎండగట్టారు కేటీఆర్. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జరిగిన సభలో మాట్లాడిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. కొన్ని ఉచిత పథకాల హామీలు ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచితంగా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డ అందరికీ ఉచితంగా ఇళ్ళు కట్టిచ్చి ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్ళు, విద్య, వైద్యం  ఫ్రీ అని ప్రకటించారు బండి సంజయ్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బండి సంజయ్ చేసిన ఈ ప్రకటనను తనకు అస్త్రంగా మలుచుకుని ట్వీట్ చేశారు కేటీఆర్. గతంలో ఉచితాలు వద్దంటూ ప్రధాని మోడీ చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ బండి సంజయ్ ని, బీజేపీ విధానాలపై తీవ్రమైన కామెంట్లు చేశారు. విశ్వగురు ఉచితాలు వద్దని చెబుతుండగా.. ఆయన శిష్యుడేమో ఫ్రిగా ఇస్తానంటున్నారంటూ బండి సంజయ్ పై సెటైర్లు వేశారు కేటీఆర్.  దేశం మొత్తానికి ఉచిత గృహాలు, విద్య, ఆరోగ్యంపై పార్లమెంటులో శాసనం చేయకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. బండి సంజయ్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వార్త పేపర్ కటింగ్ ను కేటీఆర్ షేర్ చేశారు.


కేటీఆర్ ట్వీట్ లో ఏముందంటే..


''తెలంగాణా బీజేపీ మూర్ఖత్వం విచిత్రం.. విశ్వ గురు ఉచితాలు వద్దని అంటుంగా.. ఈ జోకర్ ఎంపీ ఉచిత విద్య, ఆరోగ్యం, ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు!


ఈ దేశాన్ని పాలిస్తున్నది బీజేపీ కాదా?.. దేశం మొత్తానికి ఉచిత ఇళ్లు, ఎడ్యుకేషన్, వైద్యం పార్లమెంటులో చట్టం చేయకుండా  మిమ్మలని ఎవరు అడ్డుకుంటున్నారు?'' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.



''తెలంగాణ బీజేపీ ఇస్తున్న వాగ్దానాలకు అనుగుణంగా పార్లమెంట్‌లో చట్టాలు తీసుకురావాలని నేను ప్రధానమంత్రిని డిమాండ్ చేస్తున్నాను. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల పేద ప్రజలకు ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఉచిత డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇవ్వడం కోసం పార్లమెంటులో మీరు బిల్లు పెట్టండి మేము ఓటు వేస్తాము.'' అని కేటీఆర్ తన మరో ట్వీట్ లో చెప్పారు.


కేటీఆర్ చేసిన ట్వీట్ పై నెటిజన్ల నుంచి పెద్ద స్పందన వస్తోంది. బీజేపీ తీరుపై కొందరు తీవ్రంగా విరుచుకపడ్డారు.  ప్రధాని నరేంద్ర మోడీపై, బండి సంజయ్ కి కౌంటర్లు వేశారు.


Also read: AP Cabinet: కేబినెట్‌లో స్థానం కోల్పోతున్న ఆ మహిళా మంత్రి ఎవరు, ఆ ఇద్దరికీ మళ్లీ ఛాన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook