AP Cabinet: కేబినెట్‌లో స్థానం కోల్పోతున్న ఆ మహిళా మంత్రి ఎవరు, ఆ ఇద్దరికీ మళ్లీ ఛాన్స్

AP Cabinet: ఏపీ కేబినెట్‌లో మార్పులు రానున్నాయి. ఒకరిద్దరు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొందరిది రాంగ్ సెలెక్షన్ అయితే..మరికొందరి ఉద్వాసన తప్పుడు నిర్ణయంగా ఉందని సమాచారం. ఇప్పుడదే కసరత్తు సాగుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 10, 2022, 04:42 PM IST
AP Cabinet: కేబినెట్‌లో స్థానం కోల్పోతున్న ఆ మహిళా మంత్రి ఎవరు, ఆ ఇద్దరికీ మళ్లీ ఛాన్స్

AP Cabinet: ఏపీ కేబినెట్‌లో మార్పులు రానున్నాయి. ఒకరిద్దరు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొందరిది రాంగ్ సెలెక్షన్ అయితే..మరికొందరి ఉద్వాసన తప్పుడు నిర్ణయంగా ఉందని సమాచారం. ఇప్పుడదే కసరత్తు సాగుతోంది. 

ఎవరు ఔనన్నా కాదన్నా..ఆంధ్రప్రదేశ్ తొలి కేబినెట్ కంటే రెండవ కేబినెట్ కాస్త బలహీనంగానే ఉంది. ఏపీలో ఈసారి 175 సీట్లు టార్గెట్‌గా ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నా మంత్రుల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది పనితీరు సరిగ్గా లేకపోతే టికెట్లు ఉండవని హెచ్చరించినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. పనితీరు ప్రామాణికత మంత్రులకు కూడా వర్తిస్తుందని ఊహించలేకపోతున్నట్టున్నారు. 

మంత్రివర్గ మార్పులో లోపం

ఇటీవల అంటే ఏప్రిల్ 8న జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో పాత మంత్రులు కొందరిని తప్పించి..కొత్తవారికి చోటిచ్చారు. ఇందులో భాగంగా పేర్ని నాని, కొడాలి నాని, కన్నబాబు స్థానం కోల్పోయారు. ఈ ముగ్గురే మొన్నటివరకూ  ప్రతిపక్షాలు చేసే వివిధ రకాల ఆరోపణల్ని సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగేవారు. ప్రతిపక్షా విమర్శల్ని ఎప్పటికప్పుడు అంతకంటే దీటుగా తిప్పికొట్టేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. 

ఇదే కేబినెట్‌తో 2024 ఎన్నికలకు వెళ్లడం కష్టమేనని తెలుస్తోంది. ఇక హోంశాఖ విషయంలో పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉంది. సమస్య గురించి అవగాహన లేకుండా మాట్లాడి సమస్యను మరింత పెద్దదిగా చేయడం హోంమంత్రి తానేటి వనితకు అలవాటుగా మారింది. విడదల రజని, రోజా, అంబటి రాంబాబు వంటి సోషల్ మీడియా ఫాలోయింగ్ కలిగిన నేతలు సరైన రీతిలో స్పందించలేకపోతున్నారు. అదే ఇప్పుడు సమస్యగా మారింది. కొడాలి నాని, పేర్ని నానిలు కౌంటర్ ఇచ్చినట్టుగా ఇతరులకు ఇవ్వలేకపోతున్నారు. 

ఇటీవల రెండ్రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా ఇదే విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాక్టివ్‌గా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలో జరిగే వివిధ రకాల పరిణామాలపై యాక్టివ్‌గా ఉంటూ స్పందించాలని గట్టిగా మందలించారు. 

వైఎస్ జగన్ మందలింపు వెనుక లాజిక్

రాష్ట్రంలో జరిగే పరిణామాలపై లేదా ప్రతిపక్ష విమర్శలపై కౌంటర్ ఇవ్వాలంటే సంబంధిత అంశంపై సమాచారంతో పాటు ఆకట్టుకోగలిగే సామర్ధ్యం ఉండాలి. సోషల్ మీడియాలో పాలోయింగ్ ఉండాలి. సజ్జల వంటి నేతలకు చెప్పగలిగే సామర్ధ్యమున్నా..సోషల్ మీడియాలో ఫాలోయింగ్ లేకపోవడం మైనస్ పాయింట్. ఆయన మాటలు జనాన్ని ఆకట్టుకోలేవు. అదే కొడాలి నాని, పేర్ని నాని, కన్నబాబు వంటి నేతల మాటలు ఆకట్టుకుంటాయి.

అందుకే మంత్రివర్గంలో మార్పుల దిశగా వైఎస్ జగన్ హెచ్చరించిన మాట వాస్తవమే. అక్టోబర్ వరకూ డెడ్‌లైన్ విధించారట. మారితే సరి..లేకపోతే రోజా, విడదల రజని, అంబటి, ఆదిమూలపు సురేశ్, తానేటి వనితలు పదవులు పోగొట్టుకునే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ మార్పు జరిగితే..కొడాలి నాని, పేర్ని నానికి మళ్లీ ఛాన్స్ దక్కే పరిస్థితి ఉందని తెలుస్తోంది. 

Also read: Purandeswari Political Career: పురందేశ్వరిని బీజేపి పక్కకుపెట్టిందా ? ఎన్టీఆర్ కూతురు చేసిన తప్పేంటి ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News