Pawan Kalyan Comments: హైదరాబాద్‌ గ్యాంగ్ రేప్‌ ఘటన.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈక్రమంలో ఈఘటనపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కళ్యాణ్ స్పందించారు. దిశా ఘటన మరవకముందే మళ్లీ ఇలాంటి దారుణం చోటుచేసుకోవడం తన మనసును కలిచివేసిందన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరకుండా కఠిన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొందరు మృగాళ్లు వారు ప్రయాణిస్తున్న కారులోనే సామూహిక అత్యాచారం చేయడం మాటలకు అందని దుర్మార్గమని చెప్పారు. అల్లారుముద్దుగా పెంచుకునే బిడ్డలపై ఇలాంటి ఘటనలు జరిగితే వారి తల్లిదండ్రులు బాధలు ఎలా ఉంటాయో తనకు తెలుసు అని అన్నారు. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారికి అత్యాచారమనే ఆలోచనే రానివ్వని శిక్షలు అవసరమన్నారు. ఈకేసులో నిందితులు ఎవరూ తప్పించుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు పవన్ కళ్యాణ్.


ఈకేసు విచారణ చురుగ్గా సాగుతున్నా..దోషులను తప్పించే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరగాలన్నారు. ఆమె సత్వర న్యాయం జరగడంతోపాటు బాధితురాలు, ఆమె కుటుంబసభ్యులకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలన్నారు. దోషుల కుటుంబాల నుంచి భారీ నష్ట పరిహారం రాబట్టి బాధితురాలికి అందజేయాలన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు పవన్ కళ్యాణ్.


Also read: Telangana Bonalu-2022: తెలంగాణలో బోనాల జాతరకు వేళాయే..పండుగ ఎప్పటి నుంచి అంటే..!


Also read:Bjp Leaders Tour: తెలంగాణపై ప్రధాని మోదీ ఫోకస్..రేపు పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook